భూమిపైనే కాకుండా పుడమి వెలుపల ఎదురయ్యే ముప్పులను సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు అమెరికా ప్రపంచంలోనే తొలిసారిగా వింగ్ స్పేస్ ఫోర్స్ (యూఎస్ఎస్ఎఫ్) భూ కక్ష్యలో సైనిక విన్యాసాలను నిర్వహించనున్నది.
అమెరికా స్పేస్ ఫోర్స్ ఇటీవల రాకెట్ ల్యాబ్ నేషనల్ సెక్యూరిటీ, ట్రూ అనోమలీ అనే ప్రైవేట్ అంతరిక్ష కంపెనీలతో ఒప్పందం కుదుర్చుకుందని స్పేస్ సిస్టమ్స్ కమాండ్ పేర్కొంది. ఈ మిషన్‌కు విక్టస్ హేజ్ అని పేరు పెట్టారు. దీనిని 2025లోగా అమలు చేసే అవకాశం ఉంది.
ఈ రెండు కంపెనీలు స్పేస్ ఫోర్స్‌కు అవసరమైన ఆర్పీఓ ( రెండెజౌస్, ప్రాక్సిమిటి ఆపరేషన్స్ అంటే దాదాపు ఒకే కక్ష్యలో ఉన్న రెండు లేదా అంతకంటే ఎక్కువ ఉపగ్రహాల ఎత్తు, దశలను, వాటి సాపేక్ష స్థితులను సరిపోల్చడం), అంతరిక్ష నౌకలు వంటివి అందించనున్నాయి. ట్రూ అనోమలీకి చెందిన స్పేస్ వెహికల్ జాకల్, రాకెట్ ల్యాబ్‌కు చెందిన మానవరహిత వాహనం కక్ష్యలో సంభవించే ప్రతికూల పరిస్థితులకు స్పందించే యూఎస్ స్పేస్ ఫోర్స్ సామర్థ్యాన్ని ప్రదర్శిస్తాయి.