సూడాన్‌‌‌‌‌‌‌‌లో ఆర్మీ ప్లేన్ క్రాష్.. 46 మంది మృతి

సూడాన్‌‌‌‌‌‌‌‌లో ఆర్మీ ప్లేన్ క్రాష్.. 46 మంది మృతి

కైరో: సూడాన్‌‌‌‌‌‌‌‌లో ఘోరం జరిగింది. మిల టరీ విమానం కుప్పకూలి 46 మంది చనిపో యారు. మరో 10 మంది గాయపడ్డారు. ఓమ్దుర్మాన్‌‌‌‌‌‌‌‌ సిటీకి దగ్గర్లోని వాదీ సాయిద్నా ఎయిర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌బేస్ నుంచి మంగళవారం రాత్రి టేకాఫ్ అవుతున్న టైమ్‌‌‌‌‌‌‌‌లో ఆర్మీ ప్లేన్ క్రాష్ అయింది. విమానం ఓ ఇంటిని ఢీకొట్టడంతో పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. 

ఈ ప్రమాదంలో జవాన్లతో పాటు సాధారణ ప్రజలు ప్రాణాలు కోల్పోయారు. ప్లేన్ టేకాఫ్ అవుతుండగా ప్రమాదం జరిగిందని ఆర్మీ బుధవారం ప్రకటనలో పేర్కొంది. అయితే అందుకు కారణమేంటనేది వెల్లడించలేదు. టెక్నికల్ సమస్య వల్లనే ప్లేన్ క్రాష్ అయినట్టు తెలుస్తున్నది.