సన్నబియ్యం.. సంతోషం .. ఉమ్మడి జిల్లావ్యాప్తంగా సన్నబియ్యం పంపిణీ

సన్నబియ్యం.. సంతోషం .. ఉమ్మడి జిల్లావ్యాప్తంగా సన్నబియ్యం పంపిణీ
  • మురిసిపోయిన లబ్ధిదారులు
  • సీఎం, మంత్రులు, ఎమ్మెల్యేల ఫొటోలకు క్షీరాభిషేకాలు

ఉమ్మడి నిజామాబాద్​ జిల్లావ్యాప్తంగా రేషన్​షాపుల్లో మంగళవారం సన్న బియ్యం పంపిణీని ప్రారంభించారు. దీంతో మూడు పూటలా సన్నబియ్యం అన్నం తినొచ్చని పేదలు మురిసిపోయారు. కాంగ్రెస్​ ప్రభుత్వ నిర్ణయానికి జేజేలు పలికారు. ఇచ్చిన మాట నిలబెట్టుకున్నందుకు సీఎం రేవంత్​రెడ్డి, మంత్రులు, ఎమ్మెల్యేల ఫొటోలకు క్షీరాభిషేకాలు చేసి అభిమానాన్ని చాటుకున్నారు. 

ఆర్మూర్ మండలం పిప్రి గ్రామం లో..

ఆర్మూర్, వెలుగు :  ఆర్మూర్ మండలం పిప్రి గ్రామం లో మంగళవారం కాంగ్రెస్​ నియోజకవర్గ ఇన్​చార్జి పొద్దుటూరి వినయ్ కుమార్ రెడ్డి సన్నబియ్యం పంపిణీని ప్రారంభించారు. అనంతరం సీ ఎం రేవంత్ రెడ్డి, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, పీసీసీ ప్రెసిడెంట్ మహేశ్​గౌడ్, బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి ల ఫొటోలకు క్షీరాభిషేకం చేశారు.  కార్యక్రమంలో  మార్కెట్ కమిటీ చైర్మన్ సాయిబాబా గౌడ్, కాంగ్రెస్ శ్రేణులు పాల్గొన్నారు. 

లింగంపేట మండల కేంద్రంలో..

 లింగంపేట, వెలుగు :  మండల కేంద్రంలోని అంబేద్కర్​ కూడలిలో స్థానిక కాంగ్రెస్​ లీడర్లు  మంగళవారం సీఎం రేవంత్​రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్​మోహన్​రావు ఫొటోలకు క్షీరాభిషేకం చేశారు. కాంగ్రెస్ మండలాధ్యక్షుడు బుర్ర నారాగౌడ్​ పాల్గొన్నారు.  మెంగారం గ్రామంలో  కాంగ్రెస్​ లీడర్​ చౌలమల్లయ్య సన్న బియ్యం పంపిణీని ప్రారంభించారు. రాష్ట్ర మైనార్టీ సెల్​ కార్యదర్శి రఫీయొద్దీన్​, ఏఎంసీ వైస్​ చైర్మన్​ జొన్న ల రాజు పాల్గొన్నారు.

నందిపేట మండలంలో..

​నందిపేట, వెలుగు : ఉమ్మడి నందిపేట మండలంలోని మంగళవారం సన్నబియ్యం పంపిణీ ని కాంగ్రెస్​ నాయకులు ప్రారంభించారు. లబ్ధిదారులు సీఎం, మంత్రి ఫొటోలకు క్షీరాభిషేకం చేశారు. 

ధర్పల్లి మండల కేంద్రంలో.. 

ధర్పల్లి, వెలుగు : ధర్పల్లి మండల కేంద్రంలో మంగళవారం సన్నం బియ్యం పంపిణీని కాంగ్రెస్​ ధర్పల్లి మండలాధ్యక్షుడు చిన్నబాల్ రాజ్ ప్రారంభించారు.  

బాన్సువాడలో..

బాన్సువాడ, వెలుగు: పాత బాన్సువాడ,, కొల్లూరు గ్రామంలో సన్న బియ్యం పంపిణీ కార్యక్రమాన్ని, కొల్లూరులో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని  బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్​రెడ్డి ప్రారంభించారు.  ఆగ్రో ఇండస్ట్రీస్ చైర్మన్ కాసుల బాలరాజ్, బాన్సువాడ సబ్ కలెక్టర్  కిరణ్మయి పాల్గొన్నారు. 

బోధన్​ మండలం లంగ్డాపూర్​లో..

బోధన్​, వెలుగు : మండలం లంగ్డాపూర్​లో డీసీసీ డెలిగేట్​ గంగాశంకర్ సన్నబియ్యం పంపిణీని ప్రారంభించారు. హున్సాలో మార్కెట్​ కమిటీ ఇన్​చార్జి చైర్మన్​ శంకర్​ సన్నబియ్యం పంపిణీని ప్రారంభించారు. సీఎం, ఎమ్మెల్యే ఫొటోలకు క్షీరాభిషేకం చేశారు.  

కామారెడ్డి జిల్లా కేంద్రంలో..

కామారెడ్డిటౌన్, వెలుగు : పేదల సంక్షేమమే కాంగ్రెస్ లక్ష్యమని కామారెడ్డి డీసీసీ ప్రెసిడెంట్ కైలాస్ శ్రీనివాస్​రావు పేర్కొన్నారు. మంగళవారం జిల్లా కేంద్రంలో సన్నబియ్యం  పంపిణీ పోగ్రాంలో ఆయన పాల్గొని మాట్లాడారు. పేదల బియ్యం పక్కదారి పట్టవద్దని ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందన్నారు. కార్యక్రమంలో కాంగ్రెస్​ టౌన్​ ప్రెసిడెంట్ పండ్ల రాజు,  బ్లాక్​ కాంగ్రెస్​ ప్రెసిడెంట్ గోనే  శ్రీనివాస్, నాయకులు అశోక్​రెడ్డి,  గుడుగుల శ్రీనివాస్​,   కన్నయ్య,  బుజ్జి తదితరులు పాల్గొన్నారు.