నీట మునిగిన విజయ డెయిరీ.. విజయవాడలో పాల కొరత

ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలు.. పెద్దలనే కాదు.. చంటి పిల్లలను కూడా ఇబ్బంది పెడుతున్నాయి.  విజయవాడలో జనాలు బయటకు రావాలంటేనే భయపడుతున్నారు.  రోడ్లు చెరువులను తలపిస్తున్నాయి. ఇదే అదనుగా చేసుకొని వ్యాపారస్తులు సరుకుల ధరలను అమాంతం పెంచేస్తున్నారు.  నిత్యావసరాలు , కూరగాయల ధరలకు అమాంతం రెక్కలొచ్చాయి.  ఇదిలా ఉంటే విజయవాడలో పాల కొరత తాండవిస్తుంది. పాలప్యాకెట్ల కోసం జనాలు ఎగబడుతున్నారు.  

ALSO READ | భారీ వర్షాలు.. హోంమంత్రి ఇంట్లోకి వరద

విజయవాడ .. విజయ డెయిరీ యూనిట్​ను వరద ముంచెత్తింది.  బుడమేరు పొంగి పొర్లడంతో వరద ఉధృతికి డెయిరీ యూనిట్​ లోపల నడుం లోతుకు వరద నీరు చేరింది.  దీంతో లక్ష 50 వేల లీటర్ల పాలు, పెరుగు నీట మునిగింది.  దీంతో పాల ప్యాకెట్లు దొరక్క జనాలు ఇబ్బంది పడుతున్నారు.