దేశంలో పాలఉత్పత్తి బాగా పెరిగింది. గత సంవత్సరంతో పోలిస్తే ఈ ఏడాది పాలఉత్పత్తి 4 శాతం పెరిగి 239.30 మిలియన్ టన్నులకు చేరింది. 2023-24లో ప్రపంచ పాల ఉత్పత్తిలో భారతదేశం 31శాతం వాటాను అందిస్తూ ప్రపంచంలోనే అగ్రశ్రేణి పాల ఉత్పత్తిదారుగా ఉంది. ఈ విషయాన్ని కేంద్ర ప్రభుత్వం మంగళవారం (నవంబర్ 26) జాతీయ పాల దినోత్సవం సందర్భంగా ప్రకటించింది.
గత ఆర్థిక సంవత్సరంలో దేశంలో 230.58 మిలియన్ టన్నుల పాల ఉత్పత్తి జరిగింది. 2022--23లో 3.83శాతం ఉండగా.. 2021-22లో 5.77శాతంతో పొలిస్తే 2023-24లో పాల ఉత్పత్తి నెమ్మదిగా పెరిగింది.
ALSO READ | బంగాళాఖాతంలో తీవ్ర వాయు గుండం.. ఈ మూడు జిల్లాలో విద్యాసంస్థలకు సెలవు
నివేదిక ప్రకారం..పాల ఉత్పత్తిలో ఉత్తరప్రదేశ్ దేశంలో మొదటి స్థానంలో ఉంది. ఉత్తరప్రదేశ్ 16.21శాతం, రెండోస్థానంలో రాజస్థాన్ 14.51శాతం, మధ్యప్రదేశ్ 8.91 శాతం, గుజరాత్ 7.65శాతం, మహారాష్ట్ర 6.71శాతం ఉంది. ఈ ఐదు రాష్ట్రాలు దేశంలోని మొత్తం పాల ఉత్పత్తిలో ఇవి 53.99శాతం వాటాను కలిగిఉన్నాయి.