దేశంలో ఇప్పటికే నిత్యావసరాలు ధరలు చుక్కలు చూపిస్తున్నాయి. అయితే ఇప్పుడు కర్నాటక ప్రభుత్వం అక్కడి ప్రజలకు మరోషాక్ ఇచ్చింది. దీంతో సామాన్యుల జేబుకు భారీగా చిల్లి పడనుంది. లీటరు పాలధర రూ. 5 పెరగవచ్చని సమాచారం.. దీనికోసం సీఎం సిద్దరామయ్య ఎదుట ప్రతిపాదన పెట్టారు. సీఎం నుంచి ఆమోదం వస్తే .. నియమ నిబంధనల మేరకు ప్రభుత్వం ప్రకటన తేదీ నుంచి పాల ధరలు పెరుగుతాయి.
అయితే సీఎం సిద్దరామయ్య లీటరుకు 2 నుంచి 3 రూపాయిల వరకు పెంచేందుకు అనుమతి ఇచ్చే అవకాశం ఉంది. ప్రస్తుతం పాలు లీటరు కొనుగోలు ధర రూ. 31 ఉండగా అమ్మకం ధర రూ. 41 ఉంది, ఇప్పుడు అమ్మకం ధరను పెంచాలని ప్రభుత్వానికి ప్రతిపాదనలు వచ్చాయి. ఈవిషయంపై కర్ణాటక మిల్క్ ఫెడరేషన్ (కెఎంఎఫ్) డైరెక్టర్లతో సమావేశం కావాలని ... సహకార మంత్రి కెఎన్ రాజన్నను .. సీఎం సిద్దరామయ్య ఆదేశించారు.
ALSO READ | వంటనూనెలపై దిగుమతి సుంకం పెంపు
ధరల పెంపు ప్రతిపాదనను రాజన్న సమర్థిస్తూనే.. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే మన రాష్ట్రంలో పాల కొనుగోలు, విక్రయ ధరలు రెండూ చాలా తక్కువుగా ఉన్నాయన్నారు. కొన్ని రాష్ట్రాల్లో పాల ధరలు లీటరుకు రూ.58- నుంచి 60 వరకు ఉందన్నారు. దాని ప్రకారంగా పాల ధరను పెంచాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. రూ.5 పెంపునకు ఆమోదం లభిస్తేనే ప్రభుత్వం, పాల సంఘాల జోక్యం లేకుండా రైతులకు ప్రయోజనం చేకూరుతుందని మంత్రి తెలిపారు. ఈ ఏడాది జూన్‌లో కేఎంఎఫ్ పాల ధరలను లీటరుకు రూ.2 పెంచిందని, అలాగే ప్రతి 500 మిల్లీలీటర్ల పౌచ్‌కు అదనంగా 50 మిల్లీలీటర్ల పాలను అందజేస్తోందని తెలిపారు. ఇదే సమయంలో ప్రభుత్వం వినియోగదారులపై భారం మోపిందని ప్రతిపక్షాలు ఆరోపించాయి.