
తిరుపతి సమీపంలో ఓ భారీ పాల ట్యాంకర్ ప్రమాదవశాత్తూ బోల్తా పడింది. దీంతో ట్యాంకర్ లోని పాలు పెద్ద ఎత్తున రోడ్డుపై ఒలికిపోయి ప్రవహించాయి. మదనపల్లె నుండి తిరుపతికి వస్తుండగా బాకరావుపేట ఘాట్‌రోడ్డులో ఈ ఘటన చోటుచేసుకుంది.
సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి వెంటనే చేరుకున్నారు. బాలాజీ డైరీకి చెందిన లారీగా పోలీసులు గుర్తించారు. ఈ ఘటనలో లారీ డ్రైవర్ కు గాయాలు కావడంతో వెంటనే అతన్ని తిరుపతిలోని రుయా ఆసుపత్రికి తరలించారు.
కంపెనీ సిబ్బంది ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. దాదాపు 5,000 లీటర్ల పాలు వృధా అయినట్టు సమాచారం