- రూల్స్ ప్రకారం రూ.50 కోట్లు గ్యారంటీ చూపించాలి
- ఒక్కరే రూ.12 లక్షలు గ్యారెంటీ
- సంఘం జిల్లా అధ్యక్షుడు సహా.. గ్యారంటీ ఇవ్వకుండా దాట వేస్తున్న మిల్లర్లు
యాదాద్రి, వెలుగు : బ్యాంకు గ్యారంటీ చూపించడంలో మిల్లర్లు మీనమేషాలు లెక్కిస్తున్నారు. వడ్లు ఇవ్వకముందే బ్యాంకు గ్యారంటీ చూపించాల్సి ఉంది. వడ్లు ఇచ్చి నెల కావస్తున్నా మిల్లర్ల సంఘం అధ్యక్షుడు సహా ఎవరూ గ్యారంటీ ఇవ్వడం లేదు. సీఎంఆర్విషయంలో మిల్లర్లు పెడుతున్న ఇబ్బందులతోపాటు వడ్లను పక్కదారి పట్టిస్తుండడం వల్ల ప్రభుత్వం బ్యాంకు గ్యారంటీ కోరింది. తీసుకున్న వడ్ల విలువలో 20 శాతం బ్యాంకు గారంటీ ఇవ్వాలని తొలుత చెప్పింది.
అయితే తాము ఎలాంటి గ్యారంటీ ఇవ్వమని మిల్లర్లు మొదట్లో మొండికేశారు. దీంతో వానాకాలం కొనుగోళ్లు ప్రారంభం కాగానే.. మిల్లర్లకు వడ్లు ఇవ్వకుండా గోదాముల్లో స్టాక్ చేర్చింది. ఈ పరిణామంతో తగ్గిన మిల్లర్లు.. 10 శాతం బ్యాంకు గ్యారంటీ ఇస్తామని ముందుకొచ్చారు. దీంతో వానాకాలం సీజన్వడ్లను ఇవ్వడానికి సివిల్ సప్లయ్డిపార్ట్మెంట్అంగీకరించింది.
రూల్స్ప్రకారం ముందే..
రూల్స్ ప్రకారం తమకు ఎన్ని టన్నుల వడ్లు కావాలో ఆ విలువకు సంబంధించిన మొత్తంలో 10 శాతం బ్యాంకు గ్యారంటీని మిల్లర్లు ముందే ఇవ్వాలి. అయితే జిల్లాలోని మిల్లర్లు తాము గ్యారంటీలు ఇస్తామని సివిల్ సప్లయ్ డిపార్ట్మెంట్కు బాండ్రాసిచ్చారు. దీంతో గ్యారంటీ ఇస్తారు కదా.. అని మిల్లర్లకు వడ్లను అప్పగిస్తూ వచ్చారు. అయితే కొనుగోలు ముగిసే నాటికి 47 మిల్లులకు రూ.500 కోట్ల విలువైన 2.10 లక్షల టన్నుల వడ్లను సివిల్ సప్లయ్ అప్పగించింది.
నెల గడిచినా ఇవ్వలే..
జిల్లాలో వడ్ల కొనుగోళ్లు ముగిసి నెల కావస్తోంది. దాదాపు రూ.500 కోట్లకు పైగా విలువైన వడ్లు తీసుకున్న 47 మంది మిల్లర్లు పది శాతం అంటే రూ.50 కోట్లు బ్యాంకుగ్యారంటీగా చూపించాల్సి ఉంది. అయితే అడ్డగూడూరు మండలానికి చెందిన ఒక్క మిల్లరే తాను తీసుకున్న రూ.45 కోట్లకు పైగా విలువైన వడ్లకు రూ.12 లక్షలు (5 శాతం) గ్యారంటీ చూపించారు. రైస్ మిల్లర్అసోసియేషన్జిల్లా ప్రెసిడెంట్ మార్త వెంకటేశ్సహా వడ్లు తీసుకున్న వారెవ్వరూ గ్యారంటీ ఇవ్వలేదు. ఆఫీసర్లు అడిగినా రేపు మాపు అంటూ మాటలు చెబుతూ కాలం గడుపుతున్నారు.
గ్యారంటీ ఇస్తామని చెబుతున్నారు
బ్యాంకు గ్యారెంటీ ఇస్తామని మిల్లర్లు బాండ్ పేపర్లు ఇచ్చారు. మిల్లులకు వడ్లు ఇచ్చేశాము. బ్యాంకుగ్యారంటీ గురించి ప్రస్తావిస్తే ఇస్తామని చెబుతున్నారు. ఒక్క మిల్లర్ మాత్రం తాను తీసుకున్న వడ్లకు సంబంధించి కొంత గ్యారంటీ ఇచ్చారు.
- జగదీశ్కుమార్, డీఎం, సివిల్సప్లయ్, యాదాద్రి