టేక్మాల్, వెలుగు: రైతులు చిరుధాన్యాలు పండించుకొని వాటిని ఆహారంగా తీసుకుంటే సంపూర్ణ ఆరోగ్యంతో జీవించవచ్చని మిల్లెట్ మ్యాన్ ఆఫ్ ది తెలంగాణ వీర్ శెట్టి సూచించారు. మంగళవారం మండలంలోని పల్వంచ దత్తాత్రేయ ఆలయంలో మండల రైతు సంఘం సీఈవో వెంకటేశం అధ్యక్షతన చిరుధాన్యాల సాగుపై అవగాహన కల్పించారు. పల్వంచలో సాగుచేసిన రైతులు సుభాష్, చాకలి సాయిలు కొర్ర పంటలను మిషన్లతో పట్టి వాటితో తినుబండారులను తయారుచేసి అందరికీ రుచి చూపించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఆరోగ్యంగా ఉండాలంటే అన్నాన్ని తగ్గించి చిరుధాన్యాలతో చేసిన ఆహార పదార్థాలను ఎక్కువగా తీసుకోవాలన్నారు. రైతులకు చిరుధాన్యాలు పండిస్తే ఉచితంగా విత్తనాలు పంపిణీ చేస్తామని చెప్పారు. ఎఫ్పీవో సంఘం చైర్మన్ మొగులయ్య, ఐఐఎంఆర్ ప్రతినిధి రాంకిషోర్, మధుసూదన్ రెడ్డి, హనుమంతు, దుర్గారెడ్డి, సంగమేశ్వర్ రెడ్డి, సంఘం డైరెక్టర్లు బీరప్ప, పెంటయ్య, దత్తు, నర్సింలు, లక్ష్మీనారాయణ, సుభాష్ పాల్గొన్నారు.