రాత్రికి రాత్రే కోటీశ్వరుడైన కాశ్మీర్ యువకుడు

రాత్రికి రాత్రే కోటీశ్వరుడైన కాశ్మీర్ యువకుడు

కొంతమందికి అదృష్టం ఎలా వస్తుందో తెలియదు. రాత్రికి రాత్రే కోటీశ్వరులు అయిపోతుంటారు. ఒకరు లాటరీ ద్వారా.. మరొకరు వజ్రాలు దొరకడం.. ఇతరత్రా వాటి ద్వారా ధనవంతులవుతుంటారు. అలాగే కాశ్మీర్ కు చెందిన ఓ యువకుడు కోటీశ్వరుడయ్యాడు. దక్షిణ కాశ్మీర్ లోని బిజ్ బెహరా (Bijbehara) చెందిన వసీంరాజా అనే యువకుడు ఆన్ లైన్ ఫాంటసీ క్రికెట్ ప్లాట్ ఫామ్ డ్రీమ్ 11 (fantasy cricket platform Dream11) లో రూ. 2 కోట్లు గెలుచుకుని రాత్రికి రాత్రి మిలియనీర్ అయ్యాడు. శనివారం రాత్రి పడుకున్న తర్వాత.. అతని స్నేహితులు ఫోన్ చేసి డ్రీమ్ 11లో ఫస్ట్ నెంబర్ లో నిలుచుకున్నావని చెప్పాడని ఓ జాతీయ ఛానెల్ పేర్కొంది. ఈ విషయాన్ని నిర్ధారించుకున్న తర్వాత.. నిజంగానే రూ. 2 కోట్లు గెలుచుకున్నట్లు వసీంరాజా గ్రహించాడు.

ఈ వార్త తెలియగానే స్థానికంగా ఉన్న వాళ్లు అతడిని, అతడి కుటుంబాన్ని అభినందించారు. గత రెండు సంవత్సరాల నుంచి ఐపీఎల్ (IPL)లో ఫాంటసీ టీమ్ లను సృష్టించడం ద్వారా.. అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నట్లు తెలిపాడు. కోటీశ్వరుడు కావడం ఒక కలలాంటిదని, పేదరికంలో ఉన్న తమకు ఈ డబ్బు ఎంతగానో సహాయ పడుతుందని చెప్పుకొచ్చాడు. తల్లి అనారోగ్యంతో బాధ పడుతోందని, ఇప్పుడు ఈ డబ్బుతో చికిత్స చేయిస్తానని వెల్లడించాడు. సోషల్ మీడియాలో దీనికి సంబంధించిన వార్త వైరల్ గా మారింది. వసీం రాజాను అభినందిస్తున్నారు. డ్రీమ్ 11 అనేది ఒక ఫాంటసీ క్రికెట్. హాకీ, ఫుట్ బాల్, కబడ్డీ, బాస్కెట్ బాల్ ఆడేందుకు వినియోగదారులను అనుమతినిస్తుంది. 2019, ఏప్రిల్ లో డ్రీమ్ 11 యూనికార్న్ గా మొదటి భారతీయ గేమింగ్ కంపెనీగా అవతరించింది. 
 

మరిన్ని వార్తల కోసం : -

బధిరుల ఒలింపిక్స్‌‌‌‌ అథ్లెట్లకు ప్రధాని ఆతిథ్యం


మోడీతో బ్యాడ్మింటెన్ బృందం భేటీ