న్యూఢిల్లీ: ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్స్‌లో ఉపయోగించే క్వాల్‌కామ్ స్నాప్‌డ్రాగన్ చిప్ వల్ల కోట్లాది ఫోన్స్ రిస్క్‌లో పడ్డాయి. క్వాల్‌కామ్ డిజిటల్ సిగ్నల్ ప్రాసెసర్ (డీఎస్‌పీ) చిప్స్‌లో 400 వల్నరబులిటీస్ ఉన్నాయని చెక్‌పాయింట్ సెక్యూరిటీ రీసెర్చర్స్ గుర్తించారు. స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌లో దాదాపు 40% క్వాల్‌కామ్ చిప్స్‌నే వాడుతున్నారు. వివిధ ధరల కేటగిరీల్లోని ఫోన్స్‌లో వీడిని యూజ్ చేస్తున్నారు. ప్రీమియం ఫోన్స్ బ్రాండ్ అయిన గూగుల్, శామ్‌సంగ్, ఎల్‌జీ, షియామీతోపాటు కొన్ని మిగతా బ్రాండ్స్‌లో ఈ చిప్స్‌నే వినియోగిస్తున్నారు. ఒకవేళ ఈ చిప్స్ ఎక్స్‌ప్లాయిట్ అయితే యూజర్లకు సంబంధం లేకుండా వారి ఫోన్స్‌ను హ్యాకర్స్ స్పయ్యింగ్ టూల్స్‌తో యూజ్ చేసే ప్రమాదం ఉంది.
యూజర్లకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు, కాల్ రికార్డింగ్స్, రియల్ టైమ్ మైక్రోఫోన్ డేటా, జీపీఎస్ లొకేషన్‌ను హ్యాకర్స్ తస్కరించే చాన్స్ ఉంది. దీంతో పాటు ప్రమాదకర డేనియల్ ఆఫ్ సర్వీస్ అటాక్‌తో యూజర్ల ఫోన్స్ ఫ్రీజ్ అయ్యే అవకాశం ఉంది. దీంతో ఫోన్‌లోని డేటా మొత్తం శాశ్వతంగా డిలీట అవుతుంది. మాల్‌వేర్, మెలీషియస్ కోడ్‌లను యూజర్ల ఫోన్స్‌లో చొప్పించే ప్రమాదం ఉందని తెలిసింది. అయితే ఈ వల్నరబిలిటీస్ ఎలా ఎక్స్‌ప్లాయిట్ అవుతాయనే విషయాన్ని మాత్రం చెక్‌పాయింట్ రివీల్ చేయలేదు. ‘మేం ఈ విషయాన్ని ప్రభుత్వంలోని సంబంధిత అధికారులకు తెలిపాం. అలాగే ఆయా హ్యాండ్ సెట్స్‌ను సేఫ్‌గా ఉంచాలని ఆ ప్రాసెసర్‌ను వాడుతున్న మొబైల్ వెండర్స్‌కు చెప్పాం’ అని చెక్‌పాయింట్ పేర్కొంది.