తనను ఉద్యోగం నుంచి తొలగించారనే కోపంతో ఓ వ్యక్తి తుపాకితో కంపెనీలోకి ప్రవేశించి విచక్షణ రహితంగా కాల్పులు జరిపాడు. ఈ ఘటనలో ఐదుగురు ప్రాణాలు కోల్పోగా మరికొందరు తీవ్రంగా గాయపడ్డారు. ఆ తర్వాత నిందితుడు తనను కాల్చుకున్నాడు. ఈ ఘటన అమెరికాలోని మిల్వాకీ నగరంలో జరిగింది.
మెల్సన్ కూర్స్ బీర్ల కంపెనీలో కంపెనీలో పనిచేస్తున్న ఉద్యోగి అయిన నిందితుడిని కొంతకాలం క్రితం సంస్థ ఉద్యోగం నుంచి తొలగించింది. కోపంతో సంస్థలో పనిచేస్తున్న మరో ఉద్యోగి ఐడీకార్డు దొంగిలించి సంస్థలోకి ఎంటరయ్యాడు.తర్వాత వెంట తెచ్చుకున్న తుపాకితో ఉద్యోగులపై విచక్షణ రహితంగా కాల్పులు జరిపాడు.
ఆ తర్వాత తనను తాను కాల్చుకున్నాడు. కాల్పుల శబ్దం వినగానే ఉద్యోగులు ప్రాణభయంతో పరుగులు తీశారు. సమాచారం అందుకున్న వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించి, కేసు దర్యాప్తు చేస్తున్నారు.