టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, మంత్రులకు నిరసన సెగ తప్పడం లేదు. బోధన్ ఎమ్మెల్యే షకీల్ ను రెంజల్ బేస్, రాకాసి పేట్ కాలనీల్లో అడ్డుకున్నారు ఎంఐఎం కౌన్సిలర్లు. తమ కాలనీల్లో అభివృద్ది జరగడం లేదని అడ్డుకున్నారు. తొమ్మిదేళ్లుగా తమ ప్రాంతం ఏమి అభివృద్ది జరిగిందో చూపించాలని కౌన్సిలర్లు ఎమ్మెల్యేను ప్రశ్నించారు.
ఎమ్మెల్యే గో బ్యాక్ అంటూ నినాదాలు చేశారు. గ్రామంలో ఎలాంటి అభివృద్ది జరగలేదంటూ మండిపడ్డారు. దీంతో ఎమ్మెల్యే షకీల్ అక్కడి నుంచి వెళ్లిపోయారు ఇదిలా ఉంటే టీఆర్ఎస్ నేతలకు వరుసగా ఇలాంటి చేదు అనుభవాలు ఎదురు అవుతున్నాయి. ప్రజల నుండి వ్యక్తం అవుతున్న ఆందోళనలు టీఆర్ఎస్ ప్రజాప్రతినిధుల్లో టెన్షన్ పుడుతుంది.