అసెంబ్లీలో సంధ్య థియేటర్ తొక్కిసలాటపై స్వల్పకాలిక చర్చ జరిగింది. థియేటర్ లో జరిగిన ఘటనపై సమగ్ర విచారణ జరగాలని ఎంఐఎం ఫ్లోర్ లీడర్ అక్భరుద్ధీన్ అన్నారు. నడుటు అల్లు అర్జున్ కనీసం దవాఖానాకు వెళ్లక పోవడం దారుణమని విమర్శించారు. తొక్కిసలాటలో మహిళ మృతి చెందిందని.. బాలుడికి తీవ్రగాయాలు అయ్యాయని.. దీనిపై ఖచ్చితంగా విచారణ జరగాలని కోరారు. చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరారు.
రైతు భరోసాపై చర్చ సమయంలో సంధ్య థియేటర్ ఘటనపై విచరాణ జరగాలని అక్బరుద్ధీన్ కోరగా.. ఖచ్చితంగా విచారణ జరిపి చర్యలు తీసుకుంటామని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు.