ఆదిలాబాద్ లో ఎంఐఎం నేత ఫారూఖ్ అహ్మద్ కాల్పులు

ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో ఎంఐఎం నేత, మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ ఫారూఖ్ అహ్మద్.. రెచ్చిపోయాడు. కాలనీలో జరిగిన చిన్నపాటి గొడవలో గన్, తల్వార్ తో హల్చల్ చేశాడు. ఫారూఖ్ జరిపిన కాల్పుల్లో మోసిన్ అనే యువకుడితోపాటు మరో వ్యక్తికి బుల్లెట్ గాయాలయ్యాయి. ఫైరింగ్ చేస్తూనే అక్కడే ఉన్న పలువురిపై తల్వార్ తో దాడిచేశారు ఫారూఖ్. ప్రస్తుతం మోసిన్ పరిస్థితి విషమంగా ఉండటంతో.. హైదరాబాద్ కు తరలించారు. మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు పోలీసులు.