జేఎన్టీయూ, ఓయూ వర్సిటీ క్రెడిట్ పాయింట్లలో తేడా ఎందుకు.?: అక్బరుద్దీన్

 జేఎన్టీయూ, ఓయూ వర్సిటీ క్రెడిట్ పాయింట్లలో తేడా ఎందుకు.?: అక్బరుద్దీన్

 జేఎన్టీయూ, ఓయూ వర్సిటీల్లో క్రెడిట్ పాయింట్లలో  తేడా ఎందుకని ప్రశ్నించారు ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన ఓవైసీ.. అసెంబ్లీలో క్వశ్చన్ అవర సందర్భంగా  మాట్లాడిన ఆయన..  రెండు వర్సిటీల్లో సిలబస్ సేమ్ ఉన్నాయన్నారు.  జేఎన్టీయూ, ఓయూల్లో క్రిడెట్ పాయింట్లలో  ఏకరూపత తేవాలన్నారు. డిటేయిన్ అయిన స్టూడెంట్లు ఫీజు రీయింబర్స్ మెంట్ కు దూరమయ్యారని చెప్పారు.  విద్యార్థులను డీటేయిన్  చేస్తే  ఆరేళ్లలో ఇంజనీరింగ్ ఎలా పూర్తి చేస్తారని ప్రశ్నించారు. 

Also Read : అలాంటి పరిశ్రమల భూములను వెనక్కి తీసుకుంటాం

అక్బరుద్దీన్ ప్రశ్నలకు సమాధానంగా త్వరలోనే క్రెడిట్స్,డిటెన్షన్ పై సమావేశం నిర్వహిస్తామన్నారు మంత్రి దామోదర రాజనర్సింహా. మేనేజ్ మెంట్స్ వర్సిటీ  వీసీలతో స్పెషల్ మీటింగ్ నిర్వహిస్తామని చెప్పారు.