కులగణనపై తెలంగాణ అసెంబ్లీలో వాడివేడీగా చర్చ జరుగుతోంది. ఆధార్ 2023 రిపోర్ట్ ప్రకారం తెలంగాణ జనాభా 3.80 కోట్లని ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన ఓవైసీ అన్నారు. కులగణన సర్వే కరెక్టా? ఆధార్ వివరాలు కరెక్టా? అని ప్రశ్నించారు. సర్వే రిపోర్ట్ కరెక్ట్ అయితే ఆధార్ వివరాలు తప్పని తీర్మానం చేద్దామన్నారు. ఓటర్ లిస్ట్ తప్పయితే ఆధార్ కూడా తప్పేనా?.. రాష్ట్ర వ్యాప్తంగా ఫేక్ ఆధార్ కార్డులు ఎన్ని ఉన్నాయో లెక్కలు తేలుద్దామన్నారు.. రాష్ట్రంలో ఇవాళ్టి వరకు 90 లక్షల 10 వేల రేషన్ కార్డులున్నాయని తెలిపారు అక్బరుద్దీన్ ఓవైసీ.
ఓటర్ లిస్ట్ కు సర్వే లెక్కలకు చాలా తేడా ఉంది. నాంపల్లిలో ఫేక్ ఓట్లు చాలా ఉన్నాయి. డబుల్ డబుల్ ఓట్లు ఉన్నాయి. ఏఐ టెక్నాలజీతో జీహెచ్ఎంసీలో సర్వే చేయాలి. 2011 లెక్కల ప్రకారం 51 లక్షల మంది మైనార్టీలు ఉన్నారు. ఆధార్ 2023 రిపోర్ట్ ప్రకారం తెలంగాణలో 3 కోట్ల 80 లక్షల మంది జనాభా ఉన్నారు. నేను ఒక్క ముస్లీంలకే కాదు అన్ని వర్గాలకు ప్రతినిధిని.ముస్లీంలకు ఇపుడున్న 4 శాతం రిజర్వేషన్లు మతపరమైనవి కావు. ఈ డబ్ల్యూసీ రిజర్వేషన్లు 25 శాతం పెంచాలి. అన్ని వర్గాలు ఓట్లేస్తేనే గెలిచారు. ముస్లీం మైనారిటీలు కూడా వెనుకబడిన వాళ్లే. ఏ కులమైనా మనమందరం భారతీయులం. పేదరికం తగ్గాలంటే అన్ని వర్గాలకు అవకాశం ఇవ్వాలి.
ALSO READ | కులగణనపై కేటీఆర్ vs రేవంత్.. సర్వే వివరాలివ్వని నీకు మాట్లాడే హక్కు లేదు
మున్సిపాలిటీలకు ఎన్నికలు ఎప్పుడు నిర్వహిస్తారో చెప్పాలి. ఆలస్యం చేయకుండా స్థానిక సంస్థలకు వెంటనే ఎన్నికలు నిర్వహించాలి. ఇప్పటికే రిజర్వేషన్లు 50 శాతం వరకు ఉన్నాయి. సర్పంచ్,ఎంపీటీసీ,జెడ్పీటీసీ ఎన్నికలు ఒకేసారి జరగాలి. స్థానిక సంస్థలపై ప్రభుత్వం ఒక ప్రకటన చేయాలి. ఫీజు రీయింబర్స్ మెంట్ చాలా పెండింగ్ లో ఉన్నాయి.బీసీ,ఎస్సీ,మైనారిటీ స్టూడెంట్స్ చాలా ఇబ్బందులు పడుతున్నారు అని అక్బరుద్దీన్ ఓవైసీ అన్నారు.