బిల్డింగ్​ కూల్చివేతను అడ్డుకున్న ఎంఐఎం

బిల్డింగ్​ కూల్చివేతను అడ్డుకున్న ఎంఐఎం
  • బైఠాయించి ఆందోళన
  • తిరిగి వెళ్లిన సర్కిల్​ 12 ఆఫీసర్లు 
  • మరోసారి కూల్చివేస్తామని ప్రకటన 

మెహిదీపట్నం, వెలుగు: ఆసిఫ్ నగర్ పరిధిలో అక్రమ నిర్మాణాన్ని కూల్చేందుకు వెళ్లిన అధికారులను ఇంటి యజమానితోపాటు ఎంఐఎం లీడర్లు అడ్డుకున్నారు. సయ్యద్ అలీ గూడ ప్రాంతంలో పర్మిషన్​ తీసుకోకుండా మూడంతస్తుల బిల్డింగ్​ను కట్టారు. దీనిపై సమాచారం రావడంతో సర్కిల్ 12 ఏసీపీ కృష్ణమూర్తితో పాటు,సెక్షన్ ఆఫీసర్ సునీత మంగళవారం వెళ్లి బిల్డింగ్​పైన కొంత భాగం కూలగొట్టారు.

విషయం తెలుసుకున్న ఎంఐఎం లీడర్లు అక్కడికి వెళ్లి వాగ్వాదానికి దిగారు. బిల్డింగ్​ కూల్చవద్దంటూ భవనం ముందు బైఠాయించి ఆందోళన చేశారు. దీంతో ఉద్రిక్తత నెలకొంది. చివరకు పోలీసులు జోక్యం చేసుకొని ఇరువర్గాలతో మాట్లాడారు. ఆ తర్వాత అధికారులు అక్కడ్నుంచి వెళ్లిపోయారు. మరోమారు వచ్చి అక్రమ నిర్మాణాన్ని కూల్చివేస్తామని టౌన్ ప్లానింగ్ ఏసీపీ కృష్ణమూర్తి తెలిపారు.