తెలంగాణలో 9 స్థానాల్లో పోటీ చేయాలని మజ్లిస్ పార్టీ నిర్ణయం తీసుకుంది. ఈ మేరుకు ఆ పార్టీ చీఫ్ అసదుద్దీన్ ఒవైసీ ప్రకటించారు. ఏడు సిట్టింగ్ స్థానాలు (చంద్రాయణగుట్ట, చార్మినార్, యాకుత్ పురా, బహుదూర్ పురా, నాంపల్లి, కార్వాన్, మలక్ పేట్) తో పాటుగా జూబ్లీహిల్స్, రాజేంద్రనగర్ లో పోటీ చేస్తున్నట్లుగా ఒవైసీ వెల్లడించారు.
చంద్రాయనగుట్ట నుంచి అక్బర్ ఉద్దీన్ ఓవైసీ, నాంపల్లి నుంచి మాజీద్ హుస్సేన్, చార్మినార్ నుంచి మాజీ మేయర్ జుల్ఫికర్, యాకుత్‌పురా నుంచి జాఫర్ హుస్సేన్ మిరాజ్, మలక్‌పేట్ నుంచి అహ్మద్ బలాల పోటీ చేయనున్నట్లుగా వెల్లడించారు.
బహదూర్‌పురా, జూబ్లీహిల్స్, రాజేంద్రనగర్ నియోజకవర్గం అభ్యర్థులను త్వరలో ప్రకటిస్తామని ఒవైసీ తెలిపారు. ఒకటి రెండు రోజుల్లో ప్రచారం ప్రారంభిస్తామని చెప్పారు. అయితే ఈ సారి ఎన్నికల్లో ఎమ్మెల్యేలు పాషా ఖాద్రీ, ముంతాజ్ అహ్మద్‌కు బదులుగా మరో ఇద్దరు నిలబడతారని ఒవైసీ చెప్పారు.