ఆ నిజాయితీ ముఖ్యమని నాన్న చెప్పారు: మిమో చక్రవర్తి

ఆ నిజాయితీ ముఖ్యమని నాన్న చెప్పారు: మిమో చక్రవర్తి

చిన్నప్పటి నుంచి సౌత్ సినిమాలు చూసి పెరిగిన తాను ఇప్పుడు తెలుగులో హీరోగా పరిచయం అవడం సంతోషంగా ఉందంటున్నాడు మిథున్ చక్రవర్తి కొడుకు మిమో చక్రవర్తి. అతను హీరోగా మాధవ్ కోదాడ దర్శకత్వంలో మారుతి శ్యాం ప్రసాద్ రెడ్డి నిర్మించిన ‘నేనెక్కడున్నా’ చిత్రం ఈ శుక్రవారం విడుదలవుతోంది. ఈ సందర్భంగా మిమో చక్రవర్తి మాట్లాడుతూ ‘ఊటీలో నాన్న గారికి హోటల్‌‌‌‌ ఉండడంతో చిన్నప్పుడు తెలుగు, తమిళ సినిమాలు చూస్తూ గడిపా. అందుకే తెలుగు సినిమాలో అవకాశం అనగానే నాతో పాటు నాన్న కూడా హ్యాపీ ఫీలయ్యారు. మహిళా జర్నలిస్టుల నేపథ్యంలో సాగే ఫిమేల్ ఓరియెంటెడ్ సినిమా ఇది.

 ఆ పాత్రను సషా ఛెత్రి పోషించింది. సందేశాత్మకంగా సాగే థ్రిల్లర్. ఎండింగ్ ట్విస్ట్ సర్‌‌ప్రైజ్‌ చేస్తుంది. తెలుగులో నాకు మంచి డెబ్యూ అవుతుందని భావిస్తున్నా. విలన్, కమెడియన్, సపోర్టింగ్‌‌‌‌ రోల్స్‌‌‌‌ చేయడానికి కూడా రెడీగా ఉన్నా. ఒక నటుడికి నిజాయితీ ఎంతో ముఖ్యమని, వ్యక్తిగానూ అది ఎంతో అవసరమని నాన్న చెప్పారు. అదే ఫాలో అవుతున్నా. ప్రస్తుతం ప్రభాస్‌‌‌‌ గారి ‘ఫౌజీ’ చిత్రంలో నాన్న నటిస్తున్నారు. తెలుగు హీరోల్లో నాకు పవన్ కళ్యాణ్, ప్రభాస్‌‌‌‌ అంటే ఇష్టం. ప్రస్తుతం ‘హంటెడ్‌‌‌‌’ సీక్వెల్‌‌‌‌తో పాటు నెట్‌‌‌‌ఫ్లిక్స్‌‌‌‌ కోసం ‘ఖాకీ’ అనే వెబ్ సిరీస్‌‌‌‌లో నటిస్తున్నా’ అని చెప్పాడు.