
కీవ్: అమెరికా, ఉక్రెయిన్ మధ్య ఎకానమిక్ డీల్‌కు రంగం సిద్ధమైందని ముగ్గురు ఉక్రెయిన్ ఉన్నతాధికారులు మంగళవారం వెల్లడించారు. ఇందులో భాగంగా ఉక్రెయిన్‌లోని అరుదైన ఖనిజాలను తవ్వుకునేందుకు అమెరికాకు హక్కులు కట్టబెట్టనున్నట్టు తెలిపారు. రష్యాతో యుద్ధం నేపథ్యంలో ఉక్రెయిన్‌కు ఇప్పుడు అత్యవసర మిలిటరీ సాయం కావాలని, అందుకే ఈ డీల్‌కు తమ అధ్యక్షుడు జెలెన్ స్కీ అంగీకరించారని చెప్పారు.
ఇప్పటివరకూ ఉక్రెయిన్ కు అందించిన మిలిటరీ సాయానికి ప్రతిఫలంగానే 500 బిలియన్ డాలర్ల విలువైన అరుదైన ఖనిజాలు తవ్వుకునేందుకు అనుమతి ఇవ్వాలని ఈ మేరకు డ్రాఫ్ట్ అగ్రిమెంట్లో పేర్కొన్నారని ఓ అధికారి తెలిపారు. ట్రంప్‌తో జెలెన్ స్కీ శుక్రవారం వాషింగ్టన్లో భేటీ కానున్నారని, ఆ సందర్భంగానే మిలిటరీ సాయం కొనసాగింపుపై చర్చించే అవకాశాలు ఉన్నాయని మరో అధికారి తెలిపారు.