- ఖనిజ వనరులను అధ్యయనం చేసే శాస్త్రాన్ని మినరాలజి అంటారు.
- మినరల్ హార్ట్ ల్యాండ్ ఆఫ్ ఇండియా అని చోటానాగపూర్ ప్రాంతాన్ని పిలుస్తారు.
- వకాశి ప్రాంతాన్ని లిటిల్ జపాన్ అని తొలి ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ పిలిచేవారు.
- భారతదేశంలో రత్నగర్భ అని ఆంధ్రప్రదేశ్ ప్రాంతాన్ని పిలుస్తారు.
- 250 మిలియన్ సంవత్సరాల క్రితం జరిగిన ప్రకృతి ఉత్పాతాల వల్ల గోండ్వానా బొగ్గు ఏర్పడింది.
- దేశం మొత్తం బొగ్గు నిల్వల్లో 20 శాతం తెలంగాణలో విస్తరించి ఉన్నాయి.
- తెలంగాణలో ఉన్న బొగ్గు నిల్వలు అధికంగా బిట్యుమినస్ రకానికి చెందింది.
- తెలంగాణ రాష్ట్రంలో బొగ్గు గనులు ప్రాణహిత, గోదావరి లోయ ప్రాంతంలో అత్యధిక మొత్తంలో విస్తరించి ఉన్నాయి.
- తెలంగాణలో బొగ్గు నిల్వలు అధికంగా ఉన్న జిల్లా మంచిర్యాల.
- రాష్ట్రంలో ఉన్న మొత్తం బొగ్గు నిల్వలు 10,528 మిలియన్ టన్నులు.
- రాష్ట్రంలో బొగ్గును అధికంగా ఉత్పత్తి చేస్తున్న జిల్లా కొత్తగూడెం.
- దేశంలో బొగ్గును అధికంగా ఉత్పత్తి చేస్తున్న రాష్ట్రం జార్ఖండ్.
- రాష్ట్రంలో హెమటైట్ రకానికి చెందిన ఇనుప ఖనిజ నిల్వలు అధికంగా ఉన్నాయి.
- తెలంగాణలో హెమటైట్ నిల్వలు అధికంగా ఖమ్మం జిల్లాలో ఉన్నాయి.
- దేశంలో తొలి ఇనుప గని సింగ్భమ్.
- ఇండియాలో ఇనుప నిల్వలు అధికంగా ఉన్న రాష్ట్రంగా జార్ఖండ్ నిలిచింది.
- రాష్ట్రంలో సున్నపురాయిని అధికంగా ఉత్పత్తి చేస్తున్న జిల్లా నల్గొండ.
- సిమెంట్ పరిశ్రమలో ప్రధాన ముడి సరుకుగా సున్నపురాయి వాడుతారు.
- రాష్ట్రంలో బొగ్గు నిల్వల తర్వాత అధిక విస్తీర్ణంలో విస్తరించి ఉన్న ఖనిజం సున్నపురాయి.
- తెలంగాణలో బెరైటీస్‌ను అధికంగా ఉత్పత్తి చేస్తున్న జిల్లా ఖమ్మం.
- దేశంలో సున్నపురాయిని అధికంగా ఉత్పత్తి చేస్తున్న రాష్ట్రం మధ్యప్రదేశ్.
- దేశంలో ముగ్గురాయిని అధికంగా ఉత్పత్తి చేస్తున్న రాష్ట్రం ఆంధ్రప్రదేశ్.
- ప్రపంచంలోనే అతిపెద్ద ముగ్గురాయికి చెందిన గని మంగంపేటలో నెలకొంది.
- మాంగనీస్ నిల్వలు అధికంగా రంగారెడ్డి జిల్లాలో ఉన్నాయి.
- మాంగనీస్‌ను అధికంగా ఉత్పత్తి చేసే రాష్ట్రంగా ఒడిశా నిలిచింది.
- క్రోమైట్ కూడా అధికంగా ఉత్పత్తి చేసే రాష్ట్రం గా ఒడిశా నంబర్ వన్ స్థానంలో ఉంది.
- రాష్ట్రంలో క్రోమైట్‌ను అధికంగా ఉత్పత్తి చేసే జిల్లాగా ఖమ్మం ఉంది.
- డోలమైట్ నిల్వలు అధికంగా ఉన్న రాష్ట్రంగా ఒడిశా ఉంది.
- డోలమైట్ నిల్వలు అధికంగా ఉన్న జిల్లా గా ఖమ్మం నిలిచింది.
- రాష్ట్రంలో పెల్ట్స్పార్ అధికంగా ఉత్పత్తి చేస్తున్న జిల్లా మహబూబ్‌నగర్.
- సిరామిక్స్, గాజు, ఎనామిల్ పరిశ్రమలో ఫెల్డ్‌స్పార్ ను ఉపయోగిస్తారు.
- కొత్తగూడెం ఎక్కువగా రాగి నిల్వలు విస్తరించి ఉన్న ప్రాంతం .
- తెలంగాణ రాష్ట్రంల మైకా ఉత్పత్తిలో ప్రథమ స్థానంలో ఖమ్మం జిల్లా ఉంది.
- మైకాను ఎలక్ట్రానిక్ పరిశ్రమంలో విరివిగా ఉపయోగిస్తారు.
- రాష్ట్రంలో గుండూరు ప్రాంతం మైకా ఉత్పత్తికి ప్రసిద్ధిగాంచింది.
- తెలంగాణలో లాటరైట్ అధికంగా లభించే జిల్లా ఆసిఫాబాద్.
- లాటరైట్ ఖనిజంను ఇటుకల పరిశ్రమలో ఉపయోగిస్తారు.
- సిద్ధిపేట జిల్లాలో స్టియటైట్ అధిక మొత్తంలోలభిస్తుంది.
- బంగారం ఉత్పత్తిలో కర్ణాటక రాష్ట్రం ప్రథమ స్థానంలో ఉంది.
- దేశంలో అత్యంత లోతైన బంగారు గని హట్టి.
- తెలంగాణలో గ్రానైట్ అధికంగా విస్తరించి ఉన్న ప్రాంతం వరంగల్.
- రాష్ట్రంలో యురేనియం నిల్వలు అధికంగా ఉన్న జిల్లాగా జనగామ నిలిచింది.