రద్దు చేయడం కన్నా మినీ ఐపీఎల్ బెటర్

రద్దు చేయడం కన్నా మినీ ఐపీఎల్ బెటర్

న్యూఢిల్లీ: కరోనా దెబ్బకు ఈనెల 15వ తేదీకి వాయిదా పడ్డ ఐపీఎల్ 13వ ఎడిషన్ ఇప్పట్లో జరిగేలా కనిపించడం లేదు. జులై, సెప్టెంబర్ మధ్య గానీ, టీ20 వరల్డ్‌‌కప్‌‌ రద్దయితే అక్టోబర్‌‌లో కానీ మెగా టోర్నీని నిర్వహించే అవకాశాలపై బీసీసీఐ అధికారులు చర్చలు జరుపుతున్నారు. చాలా దేశాలు విమాన ప్రయాణాలపై ఆంక్షలు విధించడంతో ఫారిన్‌‌ ప్లేయర్లు ఇండియాకు వచ్చే చాన్స్ కనిపించడం లేదు. దీంతో కేవలం ఇండియా ప్లేయర్లతో మినీ ఐపీఎల్ నిర్వహించాలన్న ఆలోచనను రాజస్థాన్ రాయల్స్‌‌ తెరపైకి తెచ్చింది. ఈసారికి ఇలా కానిచ్చేస్తే బెటర్ అని ఆ ఫ్రాంచైజీ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ రంజిత్ బర్తాకుర్ అన్నారు. ఐపీఎల్ జరగాలని తాము కోరుకుంటున్నామని, మినీ లీగ్ అయినా తమ మద్దతు ఉంటుందన్నారు. ‘ఇండియన్స్‌‌తో లీగ్ నిర్వహించాలన్న ఆలోచనే ఇన్నాళ్లూ మాకు లేదు. కానీ ఇప్పుడు మన దేశంలో చాలా మంది నాణ్యమైన ప్లేయర్లు ఉన్నారు. అందువల్ల మొత్తం లీగ్‌‌నే రద్దు చేయడం కంటే ఇండియన్స్‌‌తో నిర్వహించడం బెటర్. కానీ ఏదైనా బీసీసీఐ డిసైడ్ చేస్తుంది. 15వ తేదీ తర్వాత ఏదో ఒక నిర్ణయం వస్తుందని అనుకుంటున్నా’ అని రంజిత్ పేర్కొన్నారు.

For More News..

కరోనా ఎఫెక్ట్: పీఎఫ్ విత్ డ్రా చేసుకోవాలంటే ఇవి ఉండాల్సిందే

కరోనా దెబ్బకు ఎంసెట్ కూడా వాయిదా?

కరోనా చావులతో రికార్డుకెక్కిన అమెరికా.. ఒక్కరోజులోనే..