
నస్పూర్, వెలుగు: అర్హులైన నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించేందుకు ఈ నెల 25న ఉదయం 10.30 గంటలకు మంచిర్యాల జిల్లా కేంద్రం బెల్లంపల్లి చౌరస్తాలోని మిమ్స్ డిగ్రీ కాలేజీలో మినీ జాబ్మేళా నిర్వహిస్తున్నామని జిల్లా ఉపాధి శిక్షణ అధికారి రవికృష్ణ ఓ ప్రకటనలో తెలిపారు. శ్రీరామ్ లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీ ప్రైవేట్ లిమిటెడ్సంస్థలో మంచిర్యాల పరిసర ప్రాంతాల్లో 30 బిజినెస్ డెవలప్మెంట్ ఎగ్జిక్యూటివ్ పోస్టులు భర్తీ చేసేందుకు 18 నుంచి 30 సంవత్సరాల మధ్య వయస్సు, డిగ్రీ అర్హత కలిగి ఉండాల న్నారు.
శ్రీవిజయ బయో ఫెర్టిలైజర్స్ ప్రైవేట్ లిమిటెడ్- కంపెనీలో మంచిర్యాల పరిసర ప్రాంతాల్లో 30 సేల్స్ ఎగ్జిక్యూటివ్స్, 10 గ్రూప్ లీడర్స్, 10 టీమ్ మేనేజర్ పోస్టులకు- 20 సంవత్సరాల వయస్సు, టెన్త్/ ఇంటర్/డిప్లొమా/బీఎస్సీ అగ్రికల్చర్/ ఎంబీఏ మార్కెటింగ్ అర్హత కలిగి ఉండాలన్నారు. ఇతర వివరాలకు 9666155347, 9640731731, 9110368501 నంబర్లలో సంప్రదించవచ్చన్నారు. అర్హత, ఆసక్తి గల వారు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.