
మంచిర్యాల, వెలుగు: మంచిర్యాలలోని మిమ్స్ డిగ్రీ కాలేజీలో ఈ నెల 28న మినీ జాబ్ మేళా నిర్వహించనున్నట్టు జిల్లా ఎంప్లాయ్మెంట్ అండ్ ట్రైనింగ్ఆఫీసర్రవికృష్ణ తెలిపారు. అపోలో ఫార్మసీలో 40 ఫార్మాసిస్ట్, 20 ట్రెయినీ ఫార్మాసిస్ట్, 30 ఫార్మసీ అసిస్టెంట్, 10 రిటైల్ ట్రెయినీ అసోసియేట్ పోస్టులు భర్తీ చేయనున్నట్టు పేర్కొన్నారు. డీఫార్మసీ, బీఫార్మసీ, ఇంటర్, డిగ్రీ పాసై 18 నుంచి 35 సంవత్సరాల లోపువారు అర్హులన్నారు. సెలెక్టయిన వారికి ట్రైనింగ్ఇచ్చి మంచిర్యాల, గోదావరిఖని, హైదరాబాద్ పనిచేసే అవకాశం కల్పిస్తారని చెప్పారు. వివరాలకు 8247656356, 8522903936 నంబర్లను సంప్రదించాలన్నారు.