నస్పూర్, వెలుగు: జిల్లాలోని నిరుద్యోగ యువతకు ఈ నెల 17న మినీ జాజ్ మేళా నిర్వహిస్తున్నామని మంచిర్యాల జిల్లా ఉపాధి కల్పన అధికారి కౌశిక్ వెంకట రమణ ఓ ప్రకటనలో తెలిపారు. అర్హత, ఆసక్తి గల నిరుద్యోగ అభ్యర్థులు జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఐటీఐ కాలేజ్ ఆవరణలో జరిగే జాబ్ మేళాకు హాజరు కావాలన్నారు.
ఫూసియన్ మైక్రో ఫైనాన్స్ సంస్థలో మంచిర్యాల జిల్లా పరిధిలో 4 బ్రాంచ్ మేనేజర్ పోస్టులు, 40 రిలేషన్ షిప్ అధికారి పోస్టులను భర్తీ చేయనున్నారు. ఇందుకు ఇంటర్/ డిప్లొమా/డిగ్రీ/ఎంబీఏ అర్హత ఉండి 18–35 సంవత్సరాల వయస్సు కలిగి ఉండాలి. శ్రీరామ్ లైఫ్ ఇన్సూరెన్స్ సంస్థలో మంచిర్యాల జిల్లా పరిధిలో 25 మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్స్ పోస్టులున్నాయని, ఏదేనా డిగ్రీ అర్హత ఉండి 18–35 సంవత్సరాల వయస్సు ఉండాలని తెలిపారు. ఇతర వివరాలకు 99634 52486, 63019 08814 నంబర్లలో సంప్రదించాలన్నారు.