డిసెంబర్ 19న ఐటీఐ కాలేజ్లో మినీ జాబ్ మేళా

నస్పూర్, వెలుగు:  మంచిర్యాల జిల్లా కేంద్రంలోని ఐటీఐ కాలేజ్ ఆవరణలో ఈ నెల 19న మినీ జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు జిల్లా ఉపాధి కల్పన అధికారి కౌశిక్ వెంకటరమణ ఓ ప్రకటనలో వెల్లడించారు. రిలయన్స్ జియో ఇఫ్రా లిమిటెడ్ సంస్థలో తెలంగాణ వ్యాప్తంగా పనిచేసేందుకు జియో ఫైబర్ ఇంజినీర్/ఇన్ స్టాలేషన్ ఇంజినీర్, జియో ఫైబర్ అసోసియేట్/అసిస్టెంట్ ఇంజినీర్ పోస్టులకు నియామకం జరుగుతుందని తెలిపారు. టెన్త్ నుండి డిగ్రీ అర్హత కలిగి ఉండాలని, 18  నుంచి 35 ఏండ్ల వయసున్నవారు అర్హులుగా పేర్కొన్నారు. పూర్తి వివరాలకు 91117 31173, 63046 00392, 93913 02351 లలో సంప్రదించాలన్నారు.