మంచిర్యాల జిల్లాలో జనవరి 24న మినీ జాబ్ మేళా

నస్పూర్, వెలుగు: మంచిర్యాల జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఐటీఐ కాలేజీ ఆవరణలో ఈ నెల 24న మినీ జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు జిల్లా ఉపాధి కల్పన అధికారి వెంకటరమణ సోమవారం ఓ ప్రకటనలో తెలిపారు. వినయ్ ఆటోటెక్ ప్రైవేట్ లిమిటెడ్ మంచిర్యాల నందు పనిచేసేందుకు డిగ్రీ అర్హత కలిగిన 10 మంది సేల్స్ ఎగ్జిక్యూటివ్స్, ఆరుగురు మెకానిక్ హెల్పర్స్(ఐటీఐ/డిప్లొమా), కమర్షియల్ వెహికల్ డ్రైవర్ 01 (బ్యాడ్జ్ లైసెన్స్),  అకౌంటెంట్ 01 (డిగ్రీ అండ్ ట్యాలీ) పోస్టుల భర్తీకి జాబ్ మేళా నిర్వహింస్తున్నట్లు చెప్పారు. 18 నుండి 25 ఏండ్ల మధ్య వయసున్నవారు అర్హులని తెలిపారు. అర్హత, ఆసక్తిఉన్న అభ్యర్థులు ఈ జాబ్ మేళాను సద్వినియోగం చేసుకోవాలన్నారు. పూర్తి వివరాలకు 9963452486, 9059486633లో సంప్రదిచవచ్చని పేర్కొన్నారు.