మేడారం మినీ జాతర తేదీలను మేడారం సమ్మక్క, సారలమ్మ జాతర పూజారుల సంఘం ప్రకటించింది. వచ్చే ఏడాది ఫిబ్రవరి 1వ తేదీ నుంచి 4 వరకు మినీ జాతర నిర్వహిస్తున్నట్లు పూజారులు తెలిపారు. ఫిబ్రవరి 1న మండమెలిగే పండగ నిర్వహిస్తామని ప్రకటించారు. 2వ తేదీన సారలమ్మ అమ్మవారి గద్దె..మూడో తేదీన సమ్మక్క గద్దె శుద్ధి చేసి.. సమ్మక్క – సారలమ్మలకు భక్తులు మొక్కులు సమర్పించుకునేందుకు అనుమతిస్తామని చెప్పారు.
మినీ మేడారం జాతరలో అమ్మవార్లను గద్దెలపైకి తీసుకరారు. గద్దెల వద్ద పూజారులు ప్రత్యేక పూజలు చేస్తారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా తగిన ఏర్పాట్లు చేయనున్నారు. కాగా ప్రతి రెండేళ్లకోసారి మేడారం మహాజాతర జరుగుతుంది.