నిజామాబాద్ సిటీలోని రఘునాథ చెరువుకు మరమ్మతులు చేయించిన తర్వాత పర్యాటకుల తాకిడి పెరిగింది. సాయంత్రం వేళలో అందమైన లైటింగ్, వాటర్ వ్యూ పాయింట్పర్యాటకులను కట్టిపడేస్తున్నాయి. ఫొటోషూట్స్, యూట్యూబ్ రీల్స్, ఫేస్బుక్ వీడియోలు చేసేందుకు అధిక సంఖ్యలో జనాలు వస్తున్నారు. గతంలోని రఘునాథ చెరువు, ఇప్పుడు మినీ ట్యాంక్ బండ్ గా పర్యాటకులకు ఆహ్లాదాన్ని పంచుతోంది.
– వెలుగు ఫొటోగ్రాఫర్, నిజామాబాద్