హైదరాబాద్లో పన్నుల వసూలుకు ఏఐ టెక్నాలజీ అలెరియా
హైదరాబాద్ శివార్లలో రెండు కొత్త ఐటీ పార్కులను ఏర్పాటు చేయబోతున్నామని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్‌బాబు చెప్పారు. హైటెక్ సిటీ తరహాలోనే ఈ రెండు ఐటీ పార్కులను నిర్మిస్తామని తెలిపారు.
పన్నుల వసూలుకు అలెరియా ఏఐ
రాష్ట్ర ప్రభుత్వ పన్నుల వసూలు, ఇతర రాబడి మార్గాల్లో ఆదాయం నష్టపోకుండా చూసే ‘అలెరియా ఏఐ’ టెక్నాలజీ పనితీరు ఆసక్తికరంగా ఉందని శ్రీధర్‌బాబు అన్నారు. ఆఫ్ లైన్లో పనిచేసే ఈ టూల్ ను వివిధ శాఖలకు అనుసంధానిస్తే రాబడిలో నష్టపోతున్న 30 శాతాన్ని తిరిగి పొందవచ్చని సంస్థ ప్రతినిధులు ఆయనకు వివరించారు. ఫ్రాన్స్, యూఏఈల్లో హెడ్‌క్వార్టర్స్ ఉన్న ఈ సంస్థ టెక్నాలజీని దేశంలో మార్కెట్ చేసేందుకు ఐబీటీ ఇన్నోవేషన్స్, ఇన్నోలాజిక్ టెక్నాలజీస్ అనుమతి పొందాయి.
ఉద్యోగుల రిటైర్మెంట్ వయస్సు పెంచే ఆలోచన లేదు
ప్రభుత్వ ఉద్యోగుల రిటైర్మెంట్ వయస్సును పెంచే ఆలోచన ప్రభుత్వానికి లేదని మంత్రి శ్రీధర్‌బాబు తెలిపారు. రాష్ట్రానికి భారీ పెట్టుబడులు తెచ్చామని, ఇప్పుడు వాటిని గ్రౌండ్ ఎలా చేయాలనే దానిపై ఫోకస్ పెట్టినట్టు తెలిపారు. మంగళవారం సెక్రటేరియెట్‌లో మంత్రి శ్రీధర్ బాబు మీడియాతో చిట్ చాట్ చేశారు. ‘‘బీఆర్‌ఎస్ పదేండ్ల కాలంలో వచ్చిన పెట్టుబడుల కంటే ఈ ఒక్క ఏడాదిలో ఎక్కువే వచ్చాయి. ఈ పెట్టుబడులను గ్రౌండ్ చేయడానికి ఇప్పటికే వర్క్ మొదలు పెట్టాం.