
- బీసీ మేధావుల కోరిక మేరకు రీసర్వే చేశాం: పొన్నం ప్రభాకర్
హైదరాబాద్, వెలుగు: కులగణన సెకండ్ సర్వేకు స్పందన అంతంత మాత్రమే వచ్చిందని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. తొలిసారి చేసిన కులగణనలో కొన్ని కులాలు తమను తక్కువ చేసి చూపాయంటూ ఆరోపణలు చేశాయని, కానీ సెకండ్ సర్వేకు వచ్చిన స్పందనేవారి ఆరోపణలకు సమాధామని శనివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు.
బీసీ మేధావులు, సంఘాల కోరిక మేరకు సర్వేకు మళ్లీ అవకాశం ఇచ్చామని చెప్పారు. కులగణనపై మాట్లాడే హక్కు బీజేపీకి లేదని, బీసీ కులగణనను వ్యతిరేకిస్తూ ఆ పార్టీ సుప్రీంకోర్టులో అఫిడవిట్ దాఖలు చేసిందని గుర్తుచేశారు. కేసీఆర్, కేటీఆర్, హరీశ్ రావు పోస్ట్ సర్వే కోసం దరఖాస్తు చేసుకోలేదని ఆయన వివరించారు.