సింగరేణిని నిండా ముంచింది బీఆర్ఎస్సే : మినిమమ్ వేజ్ బోర్డు చైర్మన్ జనక్ ప్రసాద్

సింగరేణిని నిండా ముంచింది బీఆర్ఎస్సే : మినిమమ్ వేజ్ బోర్డు చైర్మన్ జనక్ ప్రసాద్
  • మినిమమ్ వేజ్ బోర్డు చైర్మన్ జనక్ ప్రసాద్ ఫైర్

హైదరాబాద్, వెలుగు: సింగరేణిని నిండా ముంచింది పదేండ్ల బీఆర్ఎస్ పాలనేనని​మినిమయ్​ వేజ్​ బోర్డు చైర్మన్​జనక్​ప్రసాద్ మండిపడ్డారు. ఇప్పుడు సీఎం  రేవంత్​రెడ్డి నేతృత్వంలో సింగరేణిలో అద్భుత ఫలితాలు వచ్చాయని చెప్పారు.  మంగళవారం ఆయన గాంధీ భవన్ లో మీడియాతో మాట్లాడారు. "ఈసారి సింగరేణి కార్మికులకు రూ.1.90 లక్షలు  బోనస్ తోపాటు చరిత్రలో ఎన్నడూ లేనివిధంగా కాంట్రాక్టు కార్మికులకు  బోనస్ ఇవ్వడం అభినందనీయం.

కాంగ్రెస్ ప్రభుత్వం బోనస్ కాదు బోగస్ ప్రభుత్వమని బీఆర్ఎస్ నాయకులు కేటీఆర్, హరీశ్ రావు అంటున్నారు. 2014 లో బీఆర్ఎస్ ప్రభుత్వం కార్మికులకు కేవలం రూ. 13,751 బోనస్ ఇచ్చి తీవ్ర నష్టం చేసింది" అని జనక్ ​ప్రసాద్ అన్నారు.