మైనింగ్ కంపెనీ ఎన్​ఎండీసీలో ఉత్పత్తి పెంపుకు రూ.75 వేల కోట్లు

మైనింగ్ కంపెనీ ఎన్​ఎండీసీలో ఉత్పత్తి పెంపుకు రూ.75 వేల కోట్లు
  • ఎన్​ఎండీసీ ఎండీ ప్రకటన

హైదరాబాద్​, వెలుగు: ప్రభుత్వ యాజమాన్యంలోని మైనింగ్​ కంపెనీ ఎన్​ఎండీసీ లిమిటెడ్, వచ్చే పదేళ్లలో ఉత్పత్తి సామర్థ్యాన్ని 100 మిలియన్ టన్నులకు పెంచాలని లక్ష్యంగా పెట్టుకుంది.

ఇందుకోసం రూ.75 వేల కోట్ల వరకు క్యాపెక్స్​కు కేటాయిస్తామని కంపెనీ చైర్మన్  మేనేజింగ్ డైరెక్టర్ అమితావ ముఖర్జీ తెలిపారు.  కంపెనీ దగ్గర దాదాపు రూ. 13వేల నుంచి -రూ. 14వేల కోట్ల నగదు నిల్వలు  ఉన్నాయని వెల్లడించారు. 

క్యాపెక్స్​కోసం అప్పు తీసుకోవలసిన అవసరం ఉండదని ఆయన అన్నారు. ఉత్పత్తి సామర్థ్యం పెంపుతో కంపెనీ తన లాభదాయకతను కనీసం 2 రెట్లు పెంచుకోవవచ్చని చెప్పారు. ఛత్తీస్​గఢ్​లోని గనుల నుంచి వైజాగ్​కు ఐరన్​ఓర్​ను తరలించడానికి 400 కిలోమీటర్ల పైప్​లైన్​నిర్మిస్తామని ముఖర్జీ చెప్పారు.