రెచ్చిపోతున్న మైనింగ్​ మాఫియా... ఎక్కడంటే...


భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో మైనింగ్​ మాఫియా రెచ్చిపోతుంది,  ప్రభుత్వానికి రావలసిన ఆదాయాన్ని కొంతమంది అక్రమార్కులు గండికొడుతున్నారు.  పాల్వంచ సమీపంలో తోగ్గూడెంలో క్వారీ యజమానుల అక్రమ మైనింగ్​ కు అడ్డూ.. అదుపు లేకుండా పోయిందని స్థానికులు విమర్శిస్తున్నారు... పూర్తి వివరాల్లోకి వెళ్తే...

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా   పాల్వంచ మండలం తో గూడెం గ్రామంలో అక్రమ మైనింగ్ యదేచ్ఛగా కొనసాగుతూనే ఉంది.స్థానికుల నుంచి వచ్చిన ఫిర్యాదుల వచ్చిన నేపథ్యంలో రంగంలోకి దిగిన జిల్లా ఉన్నతాధికారులు తోగ్గూడెం క్వారీల యజమానులకు  తవ్వకాలను నిలిపివేయాలని నోటీసులు జారీ చేశారు.  కంకర బయటకు తరలించకుండా  క్వారీల చుట్టూ ట్రెంచ్ లను ఏర్పాటు చేశారు. అయితే  మైనింగ్ మాఫియా ... అధికారులు ఏర్పాటు చేసిన ట్రెండులను  మట్టితో పూడ్చి   కంకరను తరలిస్తున్నారు.  మైనింగ్ మాఫియాపై ఉక్కుపాదం మోపి ప్రభుత్వానికి గండి కొడుతున్న కంకర మైనింగ్ మాఫియా పై చర్యలు తీసుకోవాల్సిన అధికారులుస్థానికులు కోరుతున్నారు.