కొత్తగూడెంలోని సింగరేణి హెడ్డాఫీస్​ ఎదుట మైనింగ్​ స్టాఫ్​ ధర్నా

భద్రాద్రికొత్తగూడెం, వెలుగు : తమ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ కొత్తగూడెంలోని సింగరేణి హెడ్డాఫీస్​ ఎదుట మైనింగ్​ స్టాఫ్​ గురువారం ధర్నా నిర్వహించారు. మేనేజ్​మెంట్​ ట్రైనీ(మైనింగ్​) విభాగంలో ఖాళీగా ఉన్న 139 పోస్టులను సెకండ్​ క్లాస్​ మైన్స్​ మేనేజర్​ సర్టిఫికెట్​ గల అంతర్గత అభ్యర్థులతో భర్తీ చేయాలంటూ మైనింగ్​ స్టాఫ్​ నాయకులు యాజమాన్యాన్ని డిమాండ్​ చేశారు.

పెండింగ్​లో ఉన్న 2016 బ్యాచ్​కు చెందిన ఓఎం ప్రమోషన్​ తో కూడిన ఆఫీస్​ ఆర్డర్లను రిలీజ్​ చేయాలన్నారు. మైనింగ్​ స్టాఫ్​ ఆందోళనలకు ఏఐటీయూసీ, ఐఎన్టీయూసీ, సీఐటీయూ నేతలు సంఘీ భావం తెలిపారు. జీఎం పర్సనల్​ హనుమంతరావుకు వినతిపత్రాన్ని ఇచ్చారు.