
కోల్‌బెల్ట్, వెలుగు: రిటైర్డ్సర్టిఫికెట్హోల్డర్లను ఎంవీటీసీ కేంద్రంలో నియమించేందుకు సింగరేణి యాజమాన్యం సర్క్యూలర్జారీ చేయడంపై మైనింగ్ స్టాఫ్ మండిపడ్డారు. నిరసన వ్యక్తం చేస్తూ సోమవారం మందమర్రి ఏరియా కేకే-5 గనిపై ఆ సర్క్యూలర్‌ను దహనం చేశారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ.. రిటైర్డ్సర్టిఫికెట్హోల్డర్లను ఎంవీటీసీలో ట్రైనింగ్ఆఫీసర్లు, అసిస్టెంట్ ట్రైనింగ్ ఆఫీసర్లు, ఇన్స్ట్రక్టర్లుగా నియమించడం సరికాదన్నారు.
యాజమాన్యం నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని డిమాండ్‌చేస్తూ గని మేనేజర్ భూశంకరయ్యకు వినతిపత్రం అందజేశారు. మైనింగ్స్టాఫ్టి.సారయ్య, తిరుపతి, విక్రమ్‌సింగ్, జి.రాజేశ్, విద్యానందన్, తిరుపతి, నాగేశ్వర్రావు, సాంబయ్య తదితరులు పాల్గొన్నారు.