మరో రెండు మూడు నెలల్లో కమాండ్ కంట్రోల్ సెంటర్ అందుబాటులోకి వచ్చే అవకాశం ఉందన్నారు మంత్రి కేటీఆర్. మంత్రులు మహమూద్ అలీ, పువ్వాడ అజయ్ కుమార్ తో కేటీఆర్ పోలీస్ కమాండ్ కంట్రోల్ బిల్డింగ్ ని పరిశీలించారు. బిల్డింగ్ నిర్మాణ వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్బంగా మాట్లాడిన కేటీఆర్.. అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో 19 అంతస్తులతో ఐకాన్ గా కమాండ్ కంట్రోల్ సెంటర్ నిర్మాణం జరుగుతుందన్నారు. కమాండ్ కంట్రోల్ సెంటర్ ద్వారా హైదరాబాద్ మంరింత సేఫ్ అవుతుందన్నారు. సుమారు రూ. 600 కోట్లతో కమాండ్ కంట్రోల్ ఏర్పాటు జరుగుతుందన్నారు. సీఎం మొదటి నుంచి పోలీస్ విభాగం అభివృద్ధికి కృషి చేస్తున్నారన్నారు.
కమాండ్ కంట్రోల్ పూర్తయితే రాష్ట్ర యంత్రంగం మొత్తం ఒకేచోట నుంచి పరిస్థితులను సమీక్షించే అవకాశం ఉందన్నారు. 14 వ అంతస్తు వరకు విజిటర్స్ గ్యాలరీ అందుబాటులో ఉంటుందని.. దీని ద్వారా ప్రజలు 360 డిగ్రీల యాంగిల్ లో నగరాన్ని చూసే అవకాశం ఉందన్నారు. ఇతర రాష్ట్ర ప్రభుత్వాలు అసూయ పడేలా కమాండ్ కంట్రోల్ సెంటర్ ఉంటుందన్నారు.