వచ్చే పది రోజుల పాటు జీహెచ్ఎంసీ పరిధిలోని ప్రతీ ఎమ్మెల్యే వరద ప్రభావిత ప్రాంతాల్లోనే ఉండాలన్నారు మంత్రి కేటీఆర్. భారీ వర్షాలకు హైదరాబాద్ లో ప్రభావితమైన కాలనీల్లో సహాయ చర్యల పర్యవేక్షణకు జీహెచ్ఎంసీ పరిధిలోని ఎమ్మెల్యేలు, మేయర్, డిప్యూటీ మేయర్ తో సమీక్ష నిర్వహించారు కేటీఆర్. వరదలతో నష్టపోయిన ప్రతీ ఒక్కరికీ ముఖ్యమంత్రి ప్రకటించిన తక్షణ సహాయం అందేలా చూడాలన్నారు. జిహెచ్ఎంసి ఏర్పాటు చేసిన షెల్టర్ క్యాంపులను పరిశీలించి.. అక్కడ అందుతున్న సేవలను పర్యవేక్షించాలని కోరారు.
ముంపునకు గురై.. కష్టాల్లో ఉన్న ప్రతీ ఫ్యామిలీకి భరోసా ఇచ్చేలా ఎమ్మెల్యేలు క్షేత్రస్థాయిలో ఉండాలన్నారు కేటీఆర్. వర్షాలు కొంచెం తగ్గు ముఖం పట్టడంతో.. రిస్టోరేషన్ పనులు ముమ్మరం చేయాలన్నారు. జిహెచ్ఎంసి చేపట్టిన శానిటేషన్, పునరావాసం, రోడ్లు, డ్రైనేజీల మరమ్మత్తులు త్వరగా పూర్తి చేయాలని కోరారు. సీఎం పిలుపుతో జిహెచ్ఎంసి పరిధిలో ఉన్న ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు రెండు నెలల వేతనాన్ని ముఖ్యమంత్రి సహాయనిధికి ఇచ్చేందుకు అంగీకరించారు.
రాత్రంతా అసెంబ్లీలోనే పడుకున్నఆప్ ఎమ్మెల్యేలు
త్వరలో నాలుగో సింహం..పోలీస్ గెటప్ వేస్తే పౌరుషం వస్తుంది
మరోసారి నేపాల్ దొంగల బీభత్సం.. మత్తిచ్చి ఇళ్లు గుల్ల చేసి పరార్
తగ్గుతున్న కరోనా..24 గంటల్లో 46,791 కేసులు