ఇరిగేషన్ మంత్రిగా కాదు.. హరీశ్ దేనికి పనికి రాడు: ఉత్తమ్ కుమార్ రెడ్డి

ఇరిగేషన్ మంత్రిగా కాదు.. హరీశ్  దేనికి పనికి రాడు: ఉత్తమ్ కుమార్ రెడ్డి

 మాజీ మంత్రి హరీశ్ రావుపై మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఫైర్ అయ్యారు. హరీశ్ ఇరిగేషన్ మినిస్టర్ గా కాదు..అసలు దేనికి పనికిరాడని విమర్శించారు. తాము 12 గంటలకు మీటింగ్ అనగానే ముందే వచ్చి హరీశ్ మాట్లాడిపోయారని ధ్వజమెత్తారు. పదేళ్లు రాష్ట్రాన్ని ఏలి.. తెలంగాణను మోసం చేశారని ఆరోపించారు ఉత్తమ్.

ఏపీ నీళ్ల దోపిడికి పదేళ్లు బీఆర్ఎస్ ప్రభుత్వం సహకరించిందని ఆరోపించారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. జగన్ దోస్తీ కోసం రాయలసీమ లిఫ్ట్, పోతిరెడ్డిపాడు వదిలేశారని చెప్పారు. పదేళ్లలో శ్రీశైలం నుంచి ఔట్ సైడ్ బేసిన్ 1200 టీఎంసీలు తరలించారని వ్యాఖ్యానించారు.  తెలంగాణకు 550 టీఎంసీలు రావాల్సి ఉన్నా..  298 టీఎంసీలు సరిపోతాయని చెప్పిన ఘనత కేసీఆర్ దేనని విమర్శించారు. కేసీఆర్ అసమర్థత,చేతగాని తనం  వల్లే పాలమూరుకు నీటి కష్టాలు వచ్చాయన్నారు.  పదేళ్లు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ కనీసం టెలిమెట్రీ పరికరాలు కూడా పెట్టలేదని విమర్శించారు.

ALSO READ | శ్రీశైలంను ఏపీకి అప్పగించారు.. పదేళ్లలో 12 వందల టీఎంసీల నీళ్ల దోపిడీ : మంత్రి ఉత్తమ్

శ్రీశైలం ప్రాజెక్టును ఏపీకి అప్పగించేందుకు 2021-22లో బీఆర్ఎస్ ఒప్పుకుందని ఆరోపించారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. నాగార్జున సాగర్ శ్రీశైలం ప్రాజెక్టుల బోర్డుకు అప్పగిస్తామని 2021లో ఒప్పుకుందన్నారు. 2023 నవంబర్ లో సాగర్ ను ఏపీ ఆక్రమించింది. ఏపీ ఆక్రమణ తర్వాతే సాగర్ సీఆర్పీఎఫ్ ఆధీనంలోకి వెళ్లిందన్నారు.