పత్తి చేనులో రైతుల‌తో మంత్రి ఇంద్రకరణ్ ముచ్చట్లు

యాదాద్రి భువనగిరి జిల్లా: మునుగోడు ఉప ఎన్నికలో మంత్రులు సుడిగాలి పర్యటనలతో ముమ్మరంగా  ప్రచారం చేస్తున్నారు. తమకు అప్పగించిన గ్రామాల్లో.. ఇంటింటికీ తిరుగుతూ క్షేత్ర స్థాయిలో హడావుడి చేస్తున్నారు. ప్రచారంలో భాగంగా మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి ఇవాళ  సర్వేల్ గ్రామ శివారులో వెళ్తుండగా.. ప‌త్తి చేనులో పనిచేస్తున్న మ‌హిళా రైతుల‌ను చూసి  వాహనాన్ని ఆపి పత్తిచేనులోకి వెళ్లారు. 

మహిళా రైతులతో కలసి పత్తి ఏరుతూ వారి పనికి  ఆటంకం కలగకుండా వారి  క్షేమ సమాచారాలు.. కష్ట సుఖాలు అడిగి తెలుసుకున్నారు. ఈ సారి పంట దిగుబ‌డి ఎలా ఉంద‌ని ? రైతు బంధు వ‌స్తుందా ? అని ఆరా తీశారు. సంక్షేమ పథకాలు అందుతున్నాయా ? అని అడిగి తెలుసుకున్నారు. మునుగోడు ఉప ఎన్నికలో టీఆర్ఎస్ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డిని గెలిపించాలని కోరారు.