నిర్మల్,వెలుగు: మత్స్యకారులకు ఉపాధి కల్పిస్తామని మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి చెప్పారు. గురువారం కలెక్టర్ముషారఫ్అలీ ఫారూఖీతో కలిసి ఆయన స్వర్ణ ప్రాజెక్టులో చేప పిల్లలు వదిలారు. వర్షాలు... వరదల కారణంగా చేప పిల్లల పంపిణీ ఆలస్యమైందన్నారు. జిల్లాలోని అన్ని రిజర్వాయర్లు, చెరువుల్లో చేప పిల్లల పెంపకం చేపడుతున్నట్లు వివరించారు. చేపల మార్కెటింగ్, ఎగుమతుల కోసం ప్రభుత్వం తరఫున సబ్సిడీ ఇస్తున్నట్లు పేర్కొన్నారు. మత్స్యకారులకు ప్రమాద బీమా కల్పించినట్లు వివరించారు.
రైతుల సంక్షేమం కోసం పనిచేయాలి
మార్కెట్‌కమిటీ పాలకవర్గాలు రైతుల సంక్షేమం కోసం పనిచేయాలని మంత్రి చెప్పారు. గురువారం నిర్మల్మార్కెట్ కమిటీ పాలక వర్గ సమావేశానికి చీఫ్‌గెస్ట్‌గా హాజరయ్యారు. రైతులకు గిట్టుబాటు ధర అందాలని, దళారుల ప్రమేయం లేకుండా చూడాలని కోరారు. కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్చిలుక రమణ, వైస్ చైర్మన్ శ్రీకాంత్‌యాదవ్ తదితరులు పాల్గొన్నారు. కొత్త సచివాలయానికి అంబేద్కర్‌పేరు పెట్టడం చారిత్రాత్మక నిర్ణయమన్నారు. రాష్ట్ర ప్రభుత్వం అంబేద్కర్ ఆశయాలకు అనుగుణంగా పనిచేస్తోందన్నారు. ఢిల్లీలో నిర్మిస్తున్న కొత్త పార్లమెంట్ భవనానికి కూడా అంబేద్కర్ పేరు పెట్టాలని ఈ సందర్భంగా మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి డిమాండ్ చేశారు.