స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణపై మోడీ నోరు విప్పాలి... మంత్రి అమర్నాథ్

2024 సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఏపీలో పొలిటికల్ హీట్ పీక్స్ కి చేరింది. ఇప్పటికే అధికార, ప్రతిపక్షాలు మేనిఫెస్టోలు కూడా ప్రకటించటంతో ఎన్నికల హడావిడి పీక్స్ కి చేరింది. ఈ క్రమంలో కూటమి తరఫున ప్రచారం కోసం ప్రధాని మోడీ ఏపీ పర్యటన ప్రాధాన్యతను సంతరించుకుంది. మోడీ పర్యటనను ఉద్దేశించి మంత్రి అమర్నాథ్ కీలక వ్యాఖ్యలు చేశారు. వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణపై ప్రధాని మోడీ నోరు విప్పాలని అన్నారు.

ఎన్డీయే నేతల మాటలు నమ్మే పరిస్థితిలో ప్రజలు లేరని, స్టీల్ ప్రైవేటీకరణపై ప్రధాని మోడీ క్లారిటీ ఇస్తేనే ప్రజలు నమ్ముతారని అన్నారు. అనకాపల్లి బహిరంగ సభలో స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అంశంపై మోడీ నోరు విప్పాలని అన్నారు. ఈ అంశంపై బీజేపీ విధానం ఏంటో మోడీ చెప్పాలని అన్నారు. గతంలో వైసీపీ సహా విపక్షాల ఒత్తిడితో స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అంశంపై నెమ్మదించిన మోడీ ఈ పర్యటన సందర్బంగా స్పందిస్తారా లేదా చూడాలి.