![గంజాయి పట్టించిన వారికి బంపర్ ఆఫర్ : హోం మంత్రి అనిత](https://static.v6velugu.com/uploads/2024/07/minister-anitha-announced-that-a-toll-free-number-will-be-set-up-rewards-will-be-given-to-those-who-possess-cannabis_vhCRqVS1mW.jpg)
అమరావతి: గంజాయి, డ్రగ్స్ నియంత్రణపై ఏర్పాటు చేసిన మంత్రివర్గ సబ్ కమిటీ గురువారం సమావేశం అయింది. సమావేశంలో పలు కీలక విషయాలు చర్చించారు. గిరిజనులను ప్రలోభాలకు గురిచేసి గంజాయి సాగు చేయిస్తున్నారని ఏపీ హోం మంత్రి వంగలపూడి అనిత అన్నారు. కరోనా సమయంలో రెండేళ్ల పాటు గంజాయిపై చర్యలు తీసుకునేందుకు అవకాశం ఇవ్వలేదన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా టోల్ ఫ్రీ నెంబర్ ఏర్పాటు చేసి గంజాయి పట్టించిన వారికి రివార్డు ఇస్తామని మంత్రి అనిత ప్రకటించారు.
గంజాయి సరఫరాకి అమాయకపు గిరిజనులను బలిచేస్తున్నా రని గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సంధ్యారాణి ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం ఇచ్చిన భూమిలో గతంలో 16 రకాల పంటలు పండించేవారన్నారు. గత ఐదేళ్లుగా పథకాలన్నింటినీ వైసీపీ ప్రభుత్వం నిర్వీర్యం చేసిందని ఆరోపించారు. దీంతో అధిక డబ్బుకు ఆశపడి గంజాయి అమ్ముతూ గిరిజనులు పట్టుబడుతున్నారని తెలిపారు.