జోగిపేటలో సద్దుల బతుకమ్మ సంబరాలు

జోగిపేటలో సద్దుల బతుకమ్మ సంబరాలు
  • సందడి చేసిన మాజీ మంత్రి  బాబూమోహన్

జోగిపేట, వెలుగు : జోగిపేటలో సద్దుల బతుకమ్మ పండుగను గురువారం మహిళలు ఘనంగా జరుపుకున్నారు. రంగు రంగు పూలతో బతుకమ్మలను పేర్చి అకట్టుకునే విధంగా తయారు చేశారు. అనంతరం  మార్కెట్‌ యార్డు ప్రాంగణంలో  పూజలు నిర్వహించి ఆటపాటలతో సందడి చేశారు. ఈ బతుకమ్మ సంబరాల్లో మాజీ మంత్రి  బాబూమోహన్‌ పాల్గొని మహిళలతో బతుకమ్మ ఆడారు. రజక సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన వేడుకల్లో మాజీ డిప్యూటీ సీఎం దామోదర రాజనర్సింహ కూతురు త్రిష  పాల్గొన్నారు. అనంతరం పెద్ద చెరువులో బతుకమ్మలను నిమజ్జనం చేశారు.

ఈ సందర్భంగా డాకూరి గాలయ్య ట్రస్టు ఆధ్వర్యంలో వాటర్ బాటిళ్లను పంపిణీ చేశారు.  ఈ కార్యక్రమంలో మున్సిపల్‌ చైర్మన్‌ మల్లయ్య, ముదిరాజ్‌ సంఘం అధ్యక్షుడు శివశేఖర్, మాజీ మార్కెట్‌ చైర్మన్‌ మల్లికార్జున్, చేనేత సంఘం మాజీ చైర్మన్‌ సత్యం, కౌన్సిలర్లు సురేశ్, చిట్టిబాబు,  శివశంకర్, నాగరాజ్‌, దుర్గేశ్, సుమిత్ర,  మాధవి, చందర్, మాజీ ఎంపీటీసీ వెంకటేశం, శ్రీనివాస్, సుమన్, సాయి, నవీన్, చంద్రశేఖర్, ప్రవీణ్, లక్ష్మణ్, శంకర్‌యాదవ్, మహేశ్‌ యాదవ్, నాగరత్నం గౌడ్, శివకుమార్‌ పాల్గొన్నారు.