బోయినిపల్లి, వెలుగు: రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినిపల్లి ఎస్ఐ పృథ్వీధర్‌పై కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ ఆగ్రహం వ్యక్తం చేశారు. మర్లపేటలో ఇటీవల చనిపోయిన బీజేపీ కార్యకర్తల కుటుంబాలను మంగళవారం పరామర్శించారు. ఇటీవల కొందరు బీజేపీ కార్యకర్తలు తమపై ఎస్ఐ అక్రమ కేసులు పెట్టి ఇబ్బందులకు గురిచేస్తున్నాడని కేంద్రమంత్రికి, ఎస్పీకి ఫిర్యాదు చేశారు. దీనిపై ‘పద్ధతి మార్చుకో.., ఎవరి పైరవీతో ఇక్కడికి నువ్వు రాలేదు. ఎస్పీ దగ్గర నేనే స్వయంగా రివ్యూ పెడతా’ అంటూ షెడ్యూల్ తయారు చేయమని పీఏను ఆదేశించారు.
బండి సంజయ్‌కు సన్మానం
కోనరావుపేట, వెలుగు: వేములవాడ నియోజకవర్గ పర్యటనలో భాగంగా కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్‌ను కోనరావుపేట బీజేపీ లీడర్లు గజమాలతో సన్మానించారు. ఈ సందర్భంగా మండల అభివృద్ధి, పార్టీ బలోపేతంపై బండి సంజయ్‌తో మాట్లాడారు. బీఆర్ఎస్ లీడర్ ఆసరి రాజ్ కుమార్ యాదవ్.. కేంద్ర మంత్రి సమక్షంలో పార్టీలో చేరారు. కార్యక్రమంలో బీజేపీ నేత చెన్నమనేని వికాస్ రావు, జిల్లా కార్యదర్శి గోపాడి సురేందర్రావు, మండల అధ్యక్షుడు రామచంద్రం, బీజేవైఎం జిల్లా ఉపాధ్యక్షుడు మిరియాల్కర్ బాలాజీ, తదితరులు పాల్గొన్నారు.