కరీంనగర్ జిల్లా: కాంగ్రెస్ పార్టీ దేశ స్వాతంత్ర్యాన్ని నెహ్రూ కుటుంబానికి భజన చేసేలా వ్యవహరించిందని కేంద్ర హోమ్ శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ అన్నారు. కాంగ్రెస్ పార్టీ దేశాన్ని వర్గాలు, మతాలుగా చీల్చిందని, చరిత్రను కనుమరుగు చేసిందని ఆయన మండిపడ్డారు. స్వాతంత్ర వేడుకల సందర్భంగా కరీంనగర్ లో సోమవారం తిరంగా ర్యాలీలో మంత్రి బండి సంజయ్ పాల్గొన్నారు.
దేశ వ్యాప్తంగా హర్ ఘార్ తిరంగా కార్యక్రమాన్ని బీజేపీ యువమోర్చ నిర్వహిస్తోందని ఆయన తెలిపారు. మీడియాతో బండి సంజయ్ మాట్లాడుతూ.. నెహ్రు మైనార్టీ సంతుష్టీకరణ విధానాల వల్ల చాల మంది ఇబ్బందులు పడ్డారని ఆరోపించారు. బాంగ్లాదేశ్ లో హిందువులపై జరుగుతున్న దారుణ మారణహోమంపై రాహుల్ గాంధీ ఎందుకు ఏం మాట్లాడట్లేదని ఆయన ప్రశ్నించారు. చైనా విధానాలు, ఆదేశాలను రాహుల్ గాంధీ పాటిస్తారని అన్నారు.