కేంద్ర నిధులతోనే పంచాయతీలు నడుస్తున్నయ్‌‌‌‌‌‌‌‌ : మంత్రి బండి సంజయ్ 

కేంద్ర నిధులతోనే పంచాయతీలు నడుస్తున్నయ్‌‌‌‌‌‌‌‌ : మంత్రి బండి సంజయ్ 
  • కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ 
  • మహారాష్ట్ర  తెలంగాణ, కర్ణాటక సీఎంలు వెళ్లడంతోనే  కాంగ్రెస్  ఓటమి

వేములవాడ, వెలుగు: కేంద్ర ప్రభుత్వ నిధులతో రాష్ట్రంలో సీసీ రహదారులు, నేషనల్ హైవేల నిర్మాణాలు జరుగుతున్నాయని గ్రామపంచాయతీలు నడుస్తున్నాయని  కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ అన్నారు.  రాష్ట్రంలో  కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటి వరకు  గ్రామపంచాయతీలకు, మున్సిపాలిటీలకు, కార్పొరేషన్లకు ఒక్క రూపాయి నిధులు కేటాయించలేదన్నారు.

 శనివారం వేములవాడ  అర్బన్ మండలం సంకెపల్లిలో మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం సంకెపల్లిలో  సీసీ రోడ్లను కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ ప్రారంభించారు. ఈ సందర్భంగా బండి సంజయ్ మాట్లాడుతూ.. కేంద్రం ప్రసాద్‌‌‌‌‌‌‌‌  స్కీం తెస్తామని అనగానే సీఎం రేవంత్​ రెడ్డి హడావిడిగా ఆలయ అభివృద్ధికి శంకుస్థాపనలు చేశారన్నారు.   తెలంగాణ, కర్ణాటక సీఎంలు వెళ్లి అబద్ధాలు చెప్పడంతోనే  మహరాష్ర్టలో కాంగ్రెస్​ పార్టీ ఓడిపోయిందన్నారు.  రైతు భరోసా ఎందుకు ఇవ్వడం లేదని ప్రశ్నించారు.  డాక్టర్​ చెన్నమనేని వికాస్​ రావు తదితరులు పాల్గొన్నారు. 


రాజన్న సిరిసిల్ల,  వెలుగు:  రాజన్న  సిరిసిల్ల జిల్లాలోని గంభీరావుపేట మండలంలో రూ. 23 కోట్ల కేంద్ర నిధులతో అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..   కాంగ్రెస్ ప్రభుత్వం కూడా బీఆర్ఎస్ తోవలో నడుస్తోందన్నారు.  తెలంగాణ సొమ్మును ఇతర రాష్ట్రాల ఎన్నికల కోసం ఖర్చు పెట్టడం పద్ధతి కాదన్నారు.