వరంగల్‌‌‌‌‌‌‌‌ తూర్పులో బీజేపీ విజయం ఖాయం : బీఎల్‌‌‌‌‌‌‌‌వర్మ

వరంగల్​సిటీ, వెలుగు : వరంగల్‌‌‌‌‌‌‌‌ తూర్పు నియోజకవర్గంలో కాషాయ జెండా ఎగరడం ఖాయమని ఈశాన్య రాష్ట్రాల అభివృద్ధి, సహకార శాఖ సహాయ మంత్రి బీఎల్‌‌‌‌‌‌‌‌వర్మ, వరంగల్‌‌‌‌‌‌‌‌ అర్బన్‌‌‌‌‌‌‌‌ కో-ఆపరేటివ్‌‌‌‌‌‌‌‌ బ్యాంక్‌‌‌‌‌‌‌‌ చైర్మన్‌‌‌‌‌‌‌‌ ఎర్రబెల్లి ప్రదీప్‌‌‌‌‌‌‌‌రావు ధీమా వ్యక్తం చేశారు. నియోజకవర్గంలోని 38, 37 డివిజన్లు ఖిలా వరంగల్‌‌‌‌‌‌‌‌, పడమరకోటలో శుక్రవారం ఇంటింటికీ బీజేపీ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఇంటింటికీ తిరుగుతూ ప్రధాని మోదీ చేపట్టిన అభివృద్ధిని ప్రజలకు వివరిస్తూ పాంప్లెంట్సు పంపిణీ చేశారు. అనంతరం వారు మాట్లాడుతూ కేంద్రం అమలు చేస్తున్న పథకాలను రాష్ట్ర ప్రభుత్వం అడ్డుకుంటోందన్నారు.

రాష్ట్ర ప్రభుత్వం అందజేస్తున్న పథకాల్లో కేంద్రం వాటా ఉన్నప్పటికీ ఆ పథకాలన్నీ బీఆర్‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌‌‌‌‌వేనని చెప్పుకోవడం సిగ్గు చేటన్నారు. ప్రస్తుత ఎమ్మెల్యే ప్రజలకు చేసిందేమీ లేదన్నారు. భారీ వర్షాలతో నగరం నీట మునిగినప్పుడు, కరోనా టైంలో ఎక్కడ పోయారని ప్రశ్నించారు. ప్రధాని మోదీ చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలకు ప్రజలు ఆకర్షితులు అవుతున్నారన్నారు.

వరంగల్‌‌‌‌‌‌‌‌ జిల్లా అధ్యక్షులు కొండేటి శ్రీధర్, మాజీ అధ్యక్షుడు ఎడ్ల అశోక్‌‌‌‌‌‌‌‌రెడ్డి, కుసుమ సతీష్, వన్నాల వెంకటరమణ, సముద్రాల పరమేశ్వర్, బాకం హరిశంకర్, పొట్టి శ్రీనివాస్‌‌‌‌‌‌‌‌గుప్తా, కనుకుంట్ల రంజిత్, ఆడెపు వెంకటేశ్‌‌‌‌‌‌‌‌, పిట్టల కిరణ్, కొప్పుల క్రాంతి పాల్గొన్నారు.