ఏపీ మొత్తాన్ని డెవలప్ చేస్తాం: బొత్స సత్యనారాయణ

ఏపీ మొత్తాన్ని డెవలప్ చేస్తాం: బొత్స సత్యనారాయణ

ఆంధ్ర ప్రదేశ్: 13జిల్లాల సమగ్రాభివృద్ధికి కృషిచేస్తామని అన్నారు మంత్రి బొత్సాసత్యనారాయణ. ఏపీ డెవలప్మెంట్ పై  జీఎన్ రావు కమిటీ ఇచ్చిన నివేదికను తాము క్యాబినెట్ లో ప్రవేశపెడతామని చెప్పారు. కమిటీలో అందరూ అవగాహన ఉన్న నిపుణులు ఉన్నారని తెలిపారు. అమరావతి ప్రాంతాన్ని ఎడ్యుకేషనల్ హబ్ గా మారుస్తామని అన్నారు. అసెంబ్లీ, రాజ్ భవన్ అవరావతిలోనే ఉంటాయని… రైతులకు డెవలప్మెంట్ చేసిన ఫ్లాట్స్ ఇస్తామని చెప్పారు. గత ప్రభుత్వం ఇచ్చిన హామీలను కూడా నెరవేరుస్తామని చెప్పారు.

పెద్దిరెడ్డి అసైన్డ్ భూముల పై మాత్రమే మాట్లాడారని అన్నారు బొత్స. తాము ప్రజలకు సమాధానం చెప్పాలని..  ప్రతిపక్షాలకు కాదని ఆయన అన్నారు. అమరావతిలో మాత్రమే అభివృద్ది చేస్తే మిగతా 12 జిల్లాల పరిస్థితి ఎంటని బొత్స ప్రశ్నించారు. లక్ష కోట్లు పెట్టి రాజధాని నిర్మించే స్థితిలో ప్రభుత్వం లేదని అన్నారు.